LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nakkapalli Meeting: నక్కపల్లిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ.. ముఖ్య అతిథిగా - ఈ ప్రాంతం అభివృద్దే నా లక్ష్యం!

Anita Nakkapalli Meeting: నక్కపల్లి మండలంలో మంత్రి నివాసం వద్ద విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఎన్‌డీఏ కూటమి ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Nakkapalli Meeting: నక్కపల్లిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ.. ముఖ్య అతిథిగా - ఈ ప్రాంతం అభివృద్దే నా లక్ష్యం!
  • స్టీల్ ప్లాంట్ కోసం కొన్ని గ్రామాల ప్రజలు త్యాగం చేశారు..
     
  • ఆయా గ్రామాల ప్రజల త్యాగం మరువలేనిది... హోం మంత్రి అనిత..

Anita Nakkapalli Meeting: నక్కపల్లి మండలంలో మంత్రి నివాసం వద్ద విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఎన్‌డీఏ కూటమి ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ నక్కపల్లి మండలం టిడిపి కంచుకోటగా నిలిచిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ అందించే మండలంగా నక్కపల్లి ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి చరిత్రలో తన పేరు నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నక్కపల్లి మండలంలోని అనేక గ్రామాల ప్రజలు చేసిన త్యాగాలను మంత్రి గుర్తుచేశారు. 

ఆ గ్రామాల ప్రజల త్యాగం మరువలేనిదని, రాష్ట్ర అభివృద్ధి కోసం వారు చేసిన సహకారం ప్రశంసనీయమని అన్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. టాయ్ పార్క్ ఏర్పాటు ద్వారా సుమారు 20 వేల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయని వెల్లడించారు. అలాగే, ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు పిలుపునిచ్చారు. అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కూడా సాధించామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ స్థాపనతో నక్కపల్లి మరియు పరిసర ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని మంత్రి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నక్కపల్లి ప్రాంతం ప్రపంచ పటంలో గుర్తింపు పొందుతోందని అన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…