రష్యా రియాజాన్ ప్రాంతంలోని షిలోవ్‌స్కీ జిల్లాలోని ఓ ఎలాస్టిక్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 130 మందికి పైగా గాయపడ్డారని అత్యవసర సేవల అధికారులు వెల్లడించారు.
మాస్కోకు ఆగ్నేయ దిశలో 250 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్లాంట్‌లో గన్‌పౌడర్ వర్క్‌షాప్‌లో పేలుడు సంభవించడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక వర్గాలు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే— ఇదే ప్లాంట్‌లో 2021 అక్టోబర్‌లో జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు మరణించారు.