కువైట్ ప్రభుత్వం రోజురోజుకు కఠినమైన చర్యలను తీసుకుంటూ, ప్రజా సంక్షేమాన్ని తమ ప్రధాన లక్ష్యంగా పాలన కొనసాగిస్తోంది. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, దేశాన్ని ముందుకు నడిపించే ఆలోచనతో ప్రభుత్వం ఉందని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే, కువైట్ ప్రభుత్వం విమానాశ్రయంలో కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు తమ వద్ద ఉన్న నగదు మరియు ఇతర విలువైన వస్తువుల వివరాలను తెలపాలని ఆదేశాలను జారీ చేసింది. 3000 దినార్లకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న నగదు తమతో తీసుకెళ్లి ప్రయాణికులు కస్టమ్స్ అధికారులు దగ్గర ధ్రువీకరణ పత్రాన్ని నింపి ఆర్థిక విచారణ విభాగానికి తెలియజేయాలి.
అదేవిధంగా ఈ నిబంధన అనేది కువైట్ నుండి వచ్చే వారికి మరియు వెళ్లే వారికి కూడా వర్తిస్తుంది. ఖరీదైన వాచీలు ,బంగారు ఆభరణాలు, బంగారు కడియాలు ఇలా మరే ఇతర ఆభరణాలు ఉన్న తప్పనిసరిగా వెల్లడించాల్సిందే అని కువైట్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ప్రయాణికులు బంగారు కడియాలను తీసుకెళ్లేవారు టర్మినల్ 4 సమీపంలో ఉన్న ఎయిర్ కార్గో డిపార్ట్మెంట్ లో గణాంకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ చర్యలను కువైట్ ప్రభుత్వం మనీ లాండరీంగ్ మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సంకూర్చడం వంటి నేరాలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు.