బంతి పువ్వులు లేనిదే ఏ శుభకార్యమూ ఉండదు. పూజల నుండి వేడుకల వరకు, అలంకరణలో బంతిపూలది ప్రత్యేక స్థానం. అందుకే బంతిపూల సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. బంతిపూల సాగు అదే విధంగా ఆదాయం ఏ విధంగా వస్తుంది ఈ క్రింది విధంగా తెలుసుకోండి.
బంతిపూల సాగులో కార్తీక మాసం నాటికి పూత రావాలంటే, విత్తనాలను సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య నాటుకోవాలి. జూలై-ఆగస్టు నెలల్లో నాటుకుంటే వర్షాల వల్ల మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమయానికి నాటుకుంటే మొక్కలు బాగా పెరిగి, కార్తీక మాసం నాటికి పూలకోతకు వస్తాయి.
బంతి పువ్వు విత్తనాలు అనేక రకాలు కలవు కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికంగా ఆఫ్రికన్ బంతి రకం విత్తనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది పెద్ద పువ్వులను కలిగి ఉండి, ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఈ రకం పూలను దండలు, అలంకరణలో మరింత అందంగా కనిపిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బంతి పూలను ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో సాగు చేస్తారు. బంతి పూల మొక్కలకు ఎక్కువ నీరు అవసరం లేదు. బంతి పువ్వుల మొక్కలు నాటిన తర్వాత నేల తడిగా ఉండేలా నీరు పెట్టాలి. మొగ్గలు వచ్చే వరకు వారానికి రెండుసార్లు నీరు ఇవ్వాలి. పూత సమయంలో మాత్రం ప్రతిరోజూ నీరు పోయాలి. సాధారణంగా ఎకరానికి 5,000 నుండి 8,000 కిలోల బంతి పూల దిగుబడి వస్తుంది.
కార్తీక మాసంలో కిలో బంతిపూలు రూ. 200 అనుకుంటే, 5,000 కేజీల బంతిపూల ద్వారా రూ. 10 లక్షల ఆదాయం వస్తుంది. బంతిపూల పంట సాధారణంగా 3 నుండి 4 నెలల వరకు కోతకు వస్తుంది. అంటే, ఈ సమయంలో మీరు 8 నుండి 10 సార్లు కోత కోయవచ్చు.
బంతిపూల తోటలో అంతర పంటలు వేసుకోవచ్చు. దీనివల్ల అదనపు ఆదాయం పొందవచ్చు మరియు నేల కూడా సారవంతంగా ఉంటుంది. బంతిపూల తోటలో వేయడానికి అనువైన కొన్ని అంతర పంటలు ఉల్లిపాయలు వెల్లుల్లి ముల్లంగి క్యారెట్లు ఈ పంటల ద్వారా కూడా ఆదాయాన్ని చేకూర్చుకోవచ్చు.