వేసవి సీజన్లో మామిడి పండ్లు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. అటువంటి మామిడి పండ్లలో ఫుల్ పోషకాలు ఉంటాయి. మామిడి పండ్లు కేవలం రుచి మాత్రమే కాదు ఎన్నో సుగుణాలతో ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. అటువంటి మామిడి పండ్లను తినే విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. బాగా పోషకాలు ఉన్నాయని ఎక్కువగా తిన్నా, ఎక్కువ జ్యూసులు తాగినా అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
మామిడి పండ్లతో ఆరోగ్యం
మామిడిపండ్ల లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ తోపాటు అనేక రకాల పోషకాలు ఉంటాయి. మామిడి పండు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మామిడిపండు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇక ఇటువంటి మామిడిపండును చాలామంది జ్యూస్ గా చేసుకుని తాగుతూ ఉంటారు.
మామిడి జ్యూస్ వీళ్ళు తాగొద్దు
మామిడి పండుతో మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగే వారు కూడా లేకపోలేదు. వేసవిలో చాలామంది మామిడిపండు జ్యూస్ ను ఇష్టంగా తాగుతారు. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మామిడిపండ్ల లో సహజ చక్కెర ఉంటుంది. ఇక జ్యూస్ గా చేసుకున్నప్పుడు అందులో మరింత చక్కెరను యాడ్ చేస్తారు. ఇది మధుమేహం బాధితులకు తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంది.
మ్యాంగో జ్యూస్ తాగితే ఈ సమస్యలు ఇబ్బంది పెడతాయి
ఇక బరువు తగ్గాలి అనుకునేవారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది. మ్యాంగో జ్యూస్ లో అధిక క్యాలరీలు ఉండడం వల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మ్యాంగో జ్యూస్ తాగకూడదు. ఇదే సమయంలో ఎవరైతే జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారో వారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు మ్యాంగో జ్యూస్ తాగకూడదు.
వీళ్ళకు మ్యాంగో జ్యూస్ మంచిది కాదు
కాలేయ సంబంధిత సమస్యల విషయంలో కూడా మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది. కొంతమందికి మామిడిపండ్ల అలర్జీ ఉంటుంది. అటువంటి వారు కూడా మామిడిపండ్ల జ్యూస్ తాగితే అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా తాగకుండా ఉంటేనే మంచిది.
ఈ అనారోగ్య సమస్యలతో మామిడి జ్యూస్ తాగొద్దు
మామిడి పండ్లను తినడానికి, మామిడి జ్యూస్ ను మిల్క్ షేక్ లను తాగడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేసినప్పుడే అది మనకు మంచి ఫలితం ఇస్తుంది. కనుక మామిడి జ్యూస్ ను పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు తాగకుండా ఉంటేనే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?
వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!
పవన్ చేతికి సెలైన్ డ్రిప్.. అసలేమైందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం!
చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!
ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!
టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!
వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: