కాంతార సినీ చరిత్రలో ఒక కొత్త మైలు రాయిగా నిలిచింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకి వచ్చిన ఊహించని సక్సెస్ తర్వాత, ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ కోసం అభిమానుల్లో ఆసక్తి ఆకాశాన్నంటుతోంది. సినిమా టీం ఎలా ప్రమోట్ చేస్తుందో చూస్తేనే అర్థమవుతోంది వాళ్లు ఒక్కో అప్‌డేట్ ఇచ్చే సరికి సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోతోంది.
మొదటగా వచ్చిన మోషన్ పోస్టర్‌నే తీసుకుంటే, కేవలం కొన్ని సెకన్ల వీడియోతోనే లక్షల వ్యూస్ వచ్చేశాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ రాకముందే అభిమానులు ట్రెండ్స్ పెట్టేశారు. ఇది చూడగానే స్పష్టమవుతుంది, ఈ సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్లిపోయాయి. ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న వారి ఆతృత మాటల్లో చెప్పలేము.
సినిమా ప్రమోషన్స్‌ని చూస్తే, పెద్దగా అట్టహాసం లేకుండా, చాలా స్మార్ట్‌గా చేస్తున్నారు. చిన్న చిన్న గ్లింప్స్, లుక్స్, షూటింగ్ అప్డేట్స్ వదిలేస్తూ అభిమానుల్లో కుతూహలాన్ని పెంచుతున్నారు. మ్యూజిక్ బేస్ బాణీలలో వినిపించే స్థానిక సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ వింటేనే ఆహా అనిపిస్తుంది. దానితో ఇంకా ఏం చూపించబోతున్నారు? అనే ఆసక్తి మరింత పెరుగుతోంది.
సోషల్ మీడియాలో అయితే హడావుడి మరింత గట్టిగా ఉంది. ఒక చిన్న పిక్ బయటికి వచ్చినా ట్రెండింగ్ టాపిక్ అవుతోంది. అభిమానులు కేవలం ఎదురు చూడటమే కాకుండా, తమ ఊహాగానాలు, ఫ్యాన్ ఎడిట్స్, రీల్స్, మీమ్స్‌తో సోషల్ మీడియా నిండబెడుతున్నారు. ముఖ్యంగా యూత్‌లో ఈ సినిమా కోసం ఉన్న క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంది.
కాంతార కు వచ్చిన గ్లోబల్ రేంజ్ ఇప్పుడు చాప్టర్ వన్ మీద కూడా ఆ స్థాయి అంచనాలు తీసుకొచ్చింది. నిర్మాతలు, డైరెక్టర్ కూడా ఈ హైప్‌ని మరింత పెంచేలా ఒక్కో అప్‌డేట్ జాగ్రత్తగా రిలీజ్ చేస్తున్నారు. వారు చూపిస్తున్న ప్రోమో స్ట్రాటజీ చూస్తుంటే, ఈ సినిమా రిలీజయ్యే సమయానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సునామీ తప్పదనిపిస్తోంది.
ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం, సినిమా ప్రచార కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతున్నాయి. ఈ హైప్‌ను మరింత పై స్థాయికి తీసుకెళ్లేందుకు, సినిమా టీమ్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 28న భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తుంది.. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు. ఎన్టీఆర్ రాకతో సినిమా ప్రమోషన్స్‌కు ఒక రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఎదురుచూపులు చూస్తున్నారు.
మొత్తానికి, ‘కాంతారా చాప్టర్ వన్’ చుట్టూ ఏర్పడిన హైప్ అనేది సహజంగానే వచ్చినది. ప్రేక్షకులలో ఉన్న అంచనాలు, మీడియా క్రేజ్, సోషల్ మీడియా రచ్చ ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చేముందే ఓ సగం విజయం సాధించినట్టే కనిపిస్తోంది. ఈ మిస్టిక్ వరల్డ్‌ని చూడాలని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.