రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార 1 సినిమా గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో వివాదం మొదలైంది. సోషల్ మీడియాలో చూస్తే ఈ సినిమాను బహిష్కరించాలని, బాయ్‌కాట్ చేయాలని తెలుగు యువత గట్టిగా ప్రచారం చేస్తున్నారు. మొన్నటి నుండి ట్వీట్స్, పోస్టులు చేస్తూ ఈ సినిమా గురించి కామెంట్లు చేస్తున్నారు .
ఇటువంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్ణయం మాత్రం చాలా మందిని నిరుత్సాహపరచింది. ఎందుకంటే ఆదివారం హైదరాబాదులో ఈవెంట్‌లో రిషబ్ శెట్టి తెలుగు మాట్లాడకుండా కన్నడలోనే మాట్లాడాడు. కనీసం ఈ సినిమా ఇక్కడ విడుదల చేస్తున్నప్పుడు తెలుగులో మాట్లాడాలన్న గౌరవం కూడా లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఆశ్చర్యం ఏమిటంటే ఇతర రాష్ట్రాల్లో సినిమాలకు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఉదాహరణకు తెలుగు సినిమాలను కన్నడలోకి డబ్బింగ్ చేస్తారు. కానీ మన తెలుగు సినిమాలకు ఆ గౌరవం అక్కడ ఇవ్వరు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ మూవీ ఓ జి సినిమాకి కూడా ఇలానే చేశారు అక్కడ పోస్టర్లు కొంతమంది చించేసిన విషయం కూడా అందరికీ తెలిసినదే. వీళ్ళకు మాత్రం ఇక్కడ గౌరవాలు ఎంతవరకు సమంజసం అని కొంతమంది తమ భావాలను పరుస్తున్నారు
అందుకే తెలుగు ఆడియన్స్ బహిష్కరించాలని సోషల్ మీడియాలో బాయ్‌కాట్ కాంతార అనే హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద క్యాంపెయిన్ జరుగుతోంది. తెలుగు ప్రేక్షకులను ఇంత తక్కువగా చూడొద్దని, తెలుగు భాషకు గౌరవం ఇవ్వాలని చాలా మంది గట్టిగా చెబుతున్నారు.
మొత్తానికి ఒక సినిమా వల్ల తెలుగు రాష్ట్రాల్లో భాషా గౌరవం మీద చర్చలు మళ్లీ వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు తమ భాష, తమ సంస్కృతి విషయాల్లో ఎంత సీరియస్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .