అక్టోబర్ 1 నుండి పోస్టాఫీస్ స్పీడ్ పోస్ట్ సేవల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు పార్శిల్ అందుకునే వారు సంతకం చేయడం ద్వారా డెలివరీ పూర్తి చేసేవారు. ఇకపై కొత్త పద్ధతిలో వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) తప్పనిసరిగా చూపించాలి అనే నియమం వస్తుంది..
కొత్త విధానం ఎలా ఉంటుంది?
పార్శిల్ అందుకునే వారు తమ మొబైల్ నంబర్ ఇవ్వాలి.
ఆ నంబర్‌కి ఒక ప్రత్యేకమైన OTP వస్తుంది.
ఆ OTPని డెలివరీ సిబ్బందికి చెబితేనే పార్శిల్ అందజేస్తారు.
ఈ విధానం ద్వారా పార్శిల్ నిజమైన వ్యక్తికి చేరిందని ధృవీకరించవచ్చు. భద్రత, నమ్మకం, కస్టమర్ సంతృప్తి కోసం పోస్టల్ శాఖ ఈ మార్పు తీసుకువచ్చింది. త్వరలో సదుపాయం అందుబాటులోకి రానుంది.
పోస్టల్ సేవల్లో మార్పులు
ఒకప్పుడు బాగా వాడిన పోస్ట్‌కార్డులు ఇన్‌ల్యాండ్ లెటర్లు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. డిజిటల్ యుగం కారణంగా ప్రజలు ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని పంచుకుంటున్నారు. అలాగే ఒకప్పుడు అత్యవసర సందేశాల కోసం ఉపయోగించిన టెలిగ్రామ్ సేవలు 2013లో శాశ్వతంగా నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే.
అదేవిధంగా పోస్ట్ ఆఫ్ లో కొత్త టారిఫ్‌లు ప్రవేశ పెట్టమన్నారు.
13 సంవత్సరాల తర్వాత, అక్టోబర్ 1 నుండి స్పీడ్ పోస్ట్ టారిఫ్‌లలో మార్పులు వస్తున్నాయి.
50 గ్రాముల వరకు రూ.19
*50–250 గ్రాముల వరకు రూ.24
*250–500 గ్రాముల వరకు రూ.28 దూరప్రాంతాలకు (200 కి.మీ. నుండి 2000 కి.మీ. వరకు) ఛార్జీలు పెరిగి 50 గ్రాములపైగా రూ.47 అవుతాయి.
యితే డాక్యుమెంట్లు నమూనాలు పంపేవారికి 10% తగ్గింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. అలాగే, ఈ-కామర్స్ ప్యాకేజీల ద్వారా సేవలు వినియోగించే కస్టమర్లకు 5% తగ్గింపు ఉంటుంది.
పోస్టల్ సేవలు కాలానుగుణంగా మారుతున్నాయి. సాంకేతికత వాడకం పెరుగుతున్నా, స్పీడ్ పోస్ట్ వంటి సేవలు ఇప్పటికీ ఎంతో మంది ఆధారపడే మార్గంగా ఉన్నాయి. భద్రత, నమ్మకం, తక్కువ ఖర్చుతో డెలివరీ కోసం పోస్టాఫీసు తీసుకొస్తున్న ఈ మార్పులు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి పోస్ట్ ఆఫీస్ శాఖ వారు తెలియజేస్తున్నారు