శాసనసభ ఆవరణలో కొత్త మెషినరీని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పులివెందులలో ఓటమిపాలైన జగన్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న జగన్‌ను చూసి అసహ్యం వేస్తోందని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని, నామినేషన్లు కూడా వేయనీయకుండా పాలన నడిపారని ఆరోపించారు.
పులివెందుల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, ప్రజాస్వామ్యవాదులంతా వాటిని ఖండించాలన్నారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ సమావేశాలు వచ్చేనెల 17 లేదా 18 నుంచి ప్రారంభమవుతాయని స్పీకర్ వెల్లడించారు.