రష్యన్ చమురు కొనుగోలు విషయంలో భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు మరోసారి అంతర్జాతీయ చర్చలకు కారణమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై భారీ సుంకాలు విధించిన విషయం అందరికీ తెలిసినదే. మొదట 25 శాతం, ఆ తర్వాత 50 శాతం వరకు పెంచుకుంటూ వచ్చారు. అయితే ఈ సుంకానుకు అసలు కారణం ఏమిటంటే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, దాంతో ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక సహాయం జరుగుతోందని అమెరికా మొదటి నుండి చెప్పుకుంటూనే వస్తుంది. అయినప్పటికీ భారత్ మాత్రం తాము దేశభద్రత కోసం రష్యా చమురు కొనుగోలును చేస్తున్నామని ఇప్పటికే పలుమార్లు చెప్పిన అమెరికాకు అర్థం కావట్లేదేమో బహుశా.
ఈ నేపథ్యంలో అమెరికా మంత్రి క్రిస్ రైట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో చమురు ఎగుమతిదారులు ఉన్నారు, భారతదేశం రష్యన్ చమురుపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
చౌకగా లభిస్తోందని రష్యా నుంచి ఇంధన కొనుగోలు చేస్తుందనే భావనతో భారత్ ముందుకు వెళ్తోందని ఆయన అంగీకరించినప్పటికీ, కానీ అదే సందర్భంలో ఆ డబ్బు రష్యా యుద్ధానికి ఉపయోగపడుతోందని స్పష్టం చేశారు. ప్రతి వారం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించడం సరికాదు అని ఆయన తెలిపారు. అదేవిధంగా అధ్యక్షుడు ట్రంప్ గారికి ప్రపంచంలో శాంతి అంటే చాలా ఇష్టం అని ప్రపంచ దేశాలు శాంతియుతంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
దీనికి బదులుగా భారత్ అమెరికా సహా ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలని ఆయన సూచించడం జరిగినది. తాము భారత్‌పై శిక్షలు విధించాలనుకోవడం లేదని, కానీ ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోరుకుంటున్నామని కూడా తెలిపారు. అంతే కాకుండా భారత్‌తో సంబంధాలు మరింత బలపడాలని, వాణిజ్యం నుంచి ఇంధన రంగం వరకు అన్ని విధాలుగా పని చేయాలని అమెరికా కోరుకుంటుందని రైట్ తెలిపారు.
అయితే భారత్ కు సాలుకూనంగా తను స్వతహాగా భారత్ అభిమానినని, భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో అమెరికా వైఖరిలో కొంత మార్పు కనిపిస్తున్నప్పటికీ, అసలు ఫలితం రాబోయే వాణిజ్య చర్చల్లోనే తేలనుంది. భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుంటే, అమెరికా మాత్రం ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని కోరుకుంటోంది. ఈ మార్పు ట్రాంప్ సర్కార్ లో రావడం విశేషంగానే చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో అమెరికా భారత్ మధ్య ఏ విధమైన సంబంధాలు దేశ అభివృద్ధికి తోడ్పడతాయో లేదో అనే విషయాలను చూడాల్సిందే.