ఇండియాలో కోట్లాది మంది వారి ఆధార్ కార్డ్ ను గుర్తింపు పత్రంగా ప్రభుత్వ సేవలు పొందడానికి ఉపయోగించడం సర్వసాధారణమే. ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే UIDAI వెబ్‌సైట్ లేదా DigiLocker యాప్‌లోకి వెళ్లి అక్కడ సంబంధిత విషయాలు ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ అనేది మనకు లభిస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఇక నుండి మనం వాట్సప్ ద్వారా నేరుగా ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ సదుపాయం MyGov Helpdesk చాట్‌బాట్ ద్వారా పనిచేస్తుంది. దీని వల్ల ఫోను తిరిగి వెబ్‌సైట్ లేదా యాప్‌లలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది సులభమైన, వేగవంతమైన మార్గం. WhatsApp ద్వారా ఆధార్ పొందాలంటే కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి అవి ఏంటో ఈ క్రింది వివిధ తెలుసుకుందాం.
మొదటగా మీ ఆధార్ DigiLocker ఖాతాకు లింక్ అయి ఉండాలి. మీ మోబైల్ నంబర్ రిజిస్ట్ అయి ఉండాలి, యాక్టివ్‌గా కూడా ఉండాలి. ఇవి ఉంటే అతి సులువుగా మీరు whatsapp ద్వారా మీ ఆధార్ పొందవచ్చు
మీరే వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు ముందుగా MyGov Helpdesk నంబర్ (+91-9013151515) ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత WhatsApp ఓపెన్ చేసి Hi లేదా Namaste అని సందేశం పంపాలి. చాట్‌బాట్ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో DigiLocker Services సెలెక్ట్ చేసుకోవచ్చు.
DigiLocker ఖాతా ధృవీకరించి, మీ 12-అంకెల ఆధార్ నంబర్ ఇచ్చి, రిజిస్టర్డ్ మోబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ అయ్యాక, చాట్‌బాట్ అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల జాబితా చూపిస్తుంది. అందులో ఆధార్ ను సెలెక్ట్ చేసుకుంటే, PDF రూపంలో ఆధార్ నేరుగా WhatsApp లో వస్తుంది.
ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కసారికి ఒకే డాక్యుమెంట్ మాత్రమే పొందవచ్చు. DigiLocker లో లింక్ చేయని వారు ముందుగా DigiLocker వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా లింక్ చేసుకోవాలి.
ఈ కొత్త వాట్సాప్ సదుపాయం వల్ల ప్రజలు వారి ఆధార్ సులభంగా, వేగంగా, సురక్షితంగా పొందవచ్చు. ఇకపైన వెబ్‌సైట్ లేదా DigiLocker యాప్ తిరిగి చూడాల్సిన అవసరం లేదు.ఇది ముఖ్యంగా WhatsApp ఎక్కువగా వాడే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.