అవకాడో ప్రస్తుత కాలంలో సూపర్ ఫుడ్ గా పేరు పొందింది. ఈ ఫలం మన మెదడు, హృదయం మరియు శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మరియు ఖనిజాలు మన శరీరానికి కావాల్సిన సరైన పోషణని ఇస్తాయి. రోజూ అవకాడో తింటే వృద్ధులలో జ్ఞాపకశక్తి, దృష్టి, ఆలోచన సామర్థ్యం మెరుగవుతుంది.
ముఖ్యంగా అవకాడోలో ఎక్కువగా ఉండే మోనోసంచారిత కొవ్వులు రక్తప్రవాహం సరిగ్గా ఉండటానికి, శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే, ల్యూటిన్ వంటి కేర్‌టినాయిడ్స్ వృద్ధాప్య సమయంలో మెదడులో మానసిక తగ్గుదలను నియంత్రించగలవు. అవకాడో B విటమిన్లు కూడా సమృద్ధిగా ఇస్తుంది, ఇవి మెదడులో ఎనర్జీ ఉత్పత్తికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో, మరియు సానుకూల మానసిక స్థితిని ఉంచడంలో సహాయపడతాయి.
అయితే, అవకాడోను కొన్ని ఇతర సాధారణ ఆహారపదార్థాలతో కలిపి తినడం వలన మరిన్ని ప్రయోజనాలు కలవని నిపుణులు తెలుపుతున్నారు.
గ్రీక్ యోగర్ట్ – అవకాడోతో గ్రీక్ యోగర్ట్ తినడం మానసిక శక్తిని పెంచుతుంది. గ్రీక్ యోగర్ట్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది మెదడుకు కావాల్సిన నిర్మాణ పదార్థాలను అందిస్తుంది.
బ్లూబెర్రీలు – అవకాడోతో బ్లూబెర్రీలు తినడం జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. బ్లూబెర్రీల్లోని యాంటీఆక్సిడెంట్లు మెదడుకు రక్షణగా ఉంటాయి.
ఆకుకూరలు – అవకాడో, స్పినాచ్, మరియు ఇతర ఆకుకూరలతో సలాడ్ చేయడం మెదడు ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది. వీటిలో విటమిన్ K, ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి.
నట్స్ – వాల్‌నట్, ఆల్మండ్ వంటి నట్స్ అవకాడోతో తినడం మానసిక ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ అసిడ్స్ మెదడుకు రక్షణ ఇస్తాయి.
డార్క్ చాక్లెట్ – తక్కువ షుగర్ ఉన్న డార్క్ చాక్లెట్ తో అవకాడో తో జ్యూస్ చేసుకుని తాగి మనసుకు ప్రశాంతంగా ఉంచుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఫ్లావనాయిడ్స్ అధికంగా ఉండటంవల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
కాబట్టి, అవకాడోను ఈ విధంగా వాడితే జ్ఞాపకశక్తి, శ్రద్ధ, మరియు మానసిక ఆరోగ్యం బలపడతాయి.
చిన్న మార్పులతో, రోజువారీ డైట్‌లో అవకాడోని చేర్చడం చాలా లాభదాయకం. కాకపోతే ఈ పండుకు మార్కెట్లో ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి నెలకి రెండు సార్లు తీసుకోవడం మంచిది అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే దీన్ని తీసుకునే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మంచిది.