Actor Nagarjuna: టాలీవుడ్‌లో తీవ్రకలకలం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున.. ఏం జరిగిందంటే.?

అమరావతి అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగం రాష్ట్ర రాజకీయ వాతావరణానికి కొత్త ఊపిరి నింపింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, కేసులు, అరాచకాలను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. “నేను ఎప్పుడూ తప్పు చేయను, న్యాయబద్ధంగానే ఉంటాను. అందుకే నా మీద కేసులు పెట్టడానికి ఎవరికీ ధైర్యం ఉండదు. కానీ గత ప్రభుత్వంలో మాత్రం నాపై 17 కేసులు పెట్టారు. అడిగితే సమాధానం చెప్పలేదు” అంటూ సీఎం వ్యాఖ్యానించారు.

Viktoriia Chakraborty: యూక్రెయిన్ మహిళ భారతీయుడితో పెళ్లి... తర్వాత తన జీవితం ఎలా మారింది! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్!

చంద్రబాబు గారు టీడీపీ నేతలపై పెట్టిన కేసుల జాబితాను వివరించారు. లోకేష్, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, ధూళిపాళ్ల, దేవినేని ఉమ, ఆంజనేయులు, అయ్యన్న పత్రుడు, బీటెక్ రవి, కూన రవికుమార్, కాలువ శ్రీనివాసులు లాంటి అనేక మంది నేతలపై వందల కేసులు పెట్టారని విమర్శించారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు, 45 సార్లు అరెస్టు, పులివర్తి నానిపై 31 కేసులు, చింతమనేని ప్రభాకర్‌పై 40కి పైగా కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. “ఎవరితో పరుషంగా మాట్లాడని నిమ్మల రామానాయుడుపై కూడా 20 కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.

Tirumala ICC : తిరుమల ICC ప్రారంభం.. భక్తుల రద్దీ సమస్యలకు సాంకేతిక పరిష్కారం.. సీఎం చంద్రబాబు!

తనపై జరిగిన గత దాడులను కూడా సీఎం గుర్తు చేసుకున్నారు. “2003లో అలిపిరి వద్ద నా కారుపై మావోయిస్టులు 23 క్లైమోర్ మైన్స్ పేల్చారు. అయినా నేను బయటపడ్డాను. ఆ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలూ నాతో ఉన్నారు. 23 ఏళ్ల తర్వాత మళ్లీ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాను. అభివృద్ధి చెందుతున్న దేశంలో తుపాకీతో సమస్యలు పరిష్కరించడం సరికాదు అని నేను ఎప్పుడూ చెప్పాను” అని తెలిపారు.

Thailand Tourist: 2025 లో ఆ దేశానికి తగ్గిన విదేశీ పర్యాటకుల సంఖ్య!

రాజధాని మహిళా రైతులపై జరిగిన దౌర్జన్యాలను చంద్రబాబు గుర్తు చేశారు. “రాజధాని రైతుల ఇళ్ల బాత్రూమ్‌లపై కూడా డ్రోన్లు ఎగురవేశారు. న్యాయస్థానం-దేవస్థానం కార్యక్రమాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. సింగపూర్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేశారు. ఇది బాధ్యత గల నాయకత్వం కాదు” అని ఘాటుగా విమర్శించారు.

Visa Free Countries: వావ్! పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకపోయనా భారతీయులు ఈ 7 దేశాలకు వెళ్లి రావచ్చు!

వివేకా హత్యకేసును ప్రస్తావిస్తూ ఆయన అన్నారు: “మొదట గుండెపోటు అన్నారు. నేనూ నమ్మాను. కానీ ఆయన కూతురు సునీత ఫోన్ చేసి పోస్టుమార్టం చేయమని అడిగిన తర్వాత మాత్రమే నిజం బయటపడింది. గుండెపోటు కాదు, గొడ్డలి పోటు అని తేలింది. అయినా దాన్ని ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రచారం చేశారు. ఇలాంటి విషయాల్లో రాష్ట్ర ప్రజలకు బాధ్యత లేదా?” అని ప్రశ్నించారు.

Inflimmation Food: ఓరి దేవుడా! రోజూ ఆహారంలో తీసుకునే ఈ 7 పదార్థాలు మన ఆరోగ్యానికి ఇంత నష్టమా!

చంద్రబాబు గారు ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే రాజకీయ పార్టీలు ఉండాలి. కూటమి ప్రభుత్వం పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. అవసరమైతే చట్టాలకు మరింత పదును పెడతాం. నేరప్రవృత్తి కలిగిన వారిని కట్టడి చేస్తాం. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నంబర్ వన్ అవుతుంది. అదే విధంగా తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉండాలని మా సంకల్పం” అని స్పష్టం చేశారు.

RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! దేశవ్యాప్తంగా 8,875 రైల్వే పోస్టుల నోటిఫికేషన్ విడుదల..!

అలాగే, సోషల్ మీడియా దుర్వినియోగం, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు వంటి అంశాలపై కూడా సీఎం దృష్టి సారించారు. “సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసేవారిని వదిలిపెట్టం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తాం. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు కొత్త సాంకేతికత అవసరం ఉంది” అని అన్నారు.

CBSE: పరీక్షల షెడ్యూల్ ఖరారు..! ఫలితాల మూల్యాంకనం 12 రోజుల్లో..!

 అమరావతిని వ్యభిచార గృహమని చెప్పడం దారుణం. జగన్ పర్యటనలో ఆయన కారు కింద పడి చనిపోయిన వ్యక్తి భార్యతో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారు. అంబులెన్స్‌లో పోలీసులే చంపారని చెప్పేలా ఒత్తిడి చేశారు. ఇవన్నీ కక్ష రాజకీయాల పరాకాష్ట” అని వ్యాఖ్యానించారు.

Health Tips: ఆరోగ్యం కోసం సూపర్ ఫుడ్.. ఈ రెండు గింజలు చాలు! ఆ సమస్యలకు చెక్ - ఆరోగ్యానికి చిరునామా.!

సీఎం చంద్రబాబు ప్రసంగం మొత్తం గత ప్రభుత్వంపై ఘాటైన విమర్శలతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న పిలుపుతో సాగింది. రాష్ట్ర అభివృద్ధి, భద్రత, పారదర్శక పాలనపైనే కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

e-Aadhaar App: ఆధార్ లో చిన్న చిన్న మార్పులు కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు! కొత్త ఆధార్ యాప్ వచ్చేస్తోంది!
Mega DSC 2025: 15,941 మంది టీచర్‌లకు నియామక పత్రాలు..! ఐటి, విద్యాశాఖ మినిస్టర్స్ పర్యవేక్షణలో..!
భారతదేశం ప్రపంచంలోనే నెం.1.. దేనిలో అంటే.. కేవలం వంట పదార్థం కాదు - ఆరోగ్య జీవనశైలిలో భాగం!
Pahalgam terro: పహల్గాం ఉగ్రదాడి మిస్టరీ బహిర్గతం.. కీలక వ్యక్తి అదుపులో!