పాన్ ఇండియా సినిమాలు స్పిరిట్ మరియు కల్కి చిత్రాల నుండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ తప్పుకోవడం ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. ఈ రెండు ప్రాజెక్టులు చాలా భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. అలాంటి సినిమాల్లో నుండి ఆమె తప్పుకోవడం వెనుక కారణాలు ఇంకా బయటకు రాలేదు కానీ ఈ విషయం మీద సినిమా వర్గాల్లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది ఇది వ్యక్తిగత కారణం కావచ్చు అంటుంటే, మరికొందరు వేరే కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు.
IMDb 25 బెస్ట్ ఇండియన్ సినిమాస్ అనే ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 130 సినిమాలు ఎంపికయ్యాయి. ఆ సినిమాల్లో 10 చిత్రాల్లో కథానాయికగా నటించిన రికార్డును దీపికా పడుకోన్ సాధించారు. ఇది ఒక అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ జాబితాలో ఉన్న చాలా సినిమాలు, స్టార్‌లు, దర్శకులు కూడా గొప్ప స్థాయిలో ఉన్నా అందరిని దాటి ఆమె పేరు నిలిచింది. దీని గురించి మాట్లాడిన దీపికా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దీపికా మాట్లాడుతూ నేను ఎప్పుడూ నా మనసులో ఉన్నదే చెబుతాను నేను నమ్మే విలువలను వదులుకోను. ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించడానికి వెనుకడను. కొన్నిసార్లు ఆ దారి కష్టమైనదైనా నేను ఆగను. కానీ ఎవరి ముందు కూడా తలవంచను అని అన్నారు. ఆమె మాటలతో చాలా మంది అభిమానులు సినీ వర్గాలు మళ్లీ చర్చ మొదలుపెట్టాయి.
ఇప్పుడు స్పిరిట్, కల్కి లాంటి పెద్ద సినిమాల నుండి తప్పుకోవడం ఆమె నిర్ణయం గురించి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి తెలుగు భారతీయ సినిమా చరిత్రలో ఎంతో పెద్ద బడ్జెట్ ప్రాజెక్టులు. అలాంటి సినిమాల నుండి తప్పుకోవడం వెనుక నిజమైన కారణం ఏమిటనేది ఇంకా ఎవరికీ అర్థం కాలేదు.
మొత్తం మీద దీపికా పడుకోన్ వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చర్చకు దారి తీశాయి. ఆమె చెప్పిన నాకు కష్టమైన దారినైనా ఎంచుకోవడమే ఇష్టం కానీ ఎవరికీ తలవంచను అన్న మాటలు వినగానే చాలా మంది నెటిజన్లు ఇది సందీప్ రెడ్డి వంగ కోసం వేసిన డైలాగ్‌లా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇంకాస్త హాట్ టాపిక్‌గా మారింది.