హైదరాబాద్(Hyderabad)లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport) సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రయాణికుల రాకపోకల్లో గణనీయమైన వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 15.20 శాతం వృద్ధి సాధించి దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలను అధిగమించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏకంగా 2.13 కోట్ల మంది ప్రయాణించారు. ఈ రద్దీ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య మూడు కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ ఈ ఎయిర్‌పోర్టు మరో రికార్డు నెలకొల్పింది. ఇక్కడి నుంచి ఒక నెలలో ప్రయాణించే వారి సంఖ్య గరిష్ఠంగా 20 లక్షలే కాగా, ఈసారి మాత్రం ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో చెన్నై, కోల్‌కతాలను అధిగమించింది. అలాగే, హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి నెలకు 93 వేలమంది, దోహాకు 42 వేల మంది, అబుధాబికి 38 వేల మంది, జెడ్డాకు 31 వేల మంది, సింగపూర్‌కు 31 వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..
ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!
పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?
ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!
వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!
అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం! డిప్యూటీ కలెక్టర్ మృతి! చంద్రబాబు సంతాపం!
జగన్‌కు ఊహించని షాక్! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!
వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: