వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప తాలూకా పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. 2022లో నగరంలోని వినాయకనగర్‌లో మినిస్టరు కాలనీ పేరిట అంజద్ బాషా కుటుంబ సభ్యులు లేఅవుట్ వేశారు. దీనికి అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. ఈ లేఅవుట్‌కు ఆనుకునే అప్పటి టీడీపీ నేత, ఇప్పుడు వైసీపీలో ఉన్న జమీల్‌కు స్థలం ఉంది. దీని విషయమై అహ్మద్‌బాషా జమీల్, అతడి వర్గంపై దాడి చేశారు. ఈ దాడిలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తికి కాళ్లు విరిగాయి. అహ్మద్‌బాషాపై కడప తాలూకా పోలీసుస్టేషన్‌లో నాన్ బెయిల్‌బుల్ కేసు (క్రైం నం.402/22) నమోదైంది. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. ఇది కాకుండా ఆయనపై కడప చిన్నచౌకులో ఒకటి, టూ టౌన్‌లో మరో నాలుగు కేసులు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!
అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో వీరి జోలికి ఎవరూ పోలేదు. ఇక.. ఎన్నికల సమయంలో ఇప్పటి హోంమంత్రి అనిత, అచ్చెన్నాయుడుపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా బాషా పోస్టులు పెట్టారు. వీటిపైనా కేసు నమోదైంది. ఎన్నికలకు ముందు అహ్మద్ బాషా ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్.మాధవిని, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై కూడా కేసు నమోదైంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక అహ్మద్‌బాషా సైలెంట్ అయిపోయారు. ఎక్కువ కాలం గల్ఫ్‌లో ఉంటూ హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఇంకోవైపు.. ఆయనపై చిన్నచౌకు పోలీసులు లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. రంజాన్ పండక్కి కడపకు వచ్చిన ఆయన తిరిగి గల్ఫ్ వెళ్లేందుకు ఐదురోజులుగా ముంబైలో ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి మరో బహుమతి! ఆ 11 నగరాల్లో! భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!
శనివారం రాత్రి గల్ఫ్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ముంబై ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అక్కడ సహారా పోలీసుస్టేషన్‌లో అప్పగించి కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం అక్కడకు ఆయన్ను అదుపులోకి తీసుకుని బాంద్రా కోర్టులో హాజరుపరచింది. అక్కడి కోర్టు అనుమతితో సోమవారం కడపకు తీసుకురానున్నారు. ఇక్కడి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ కార్యకర్తలు ఆదివారం కడపలో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆర్.శ్రీనివాసరెడ్డిని నాడు బాషా తీవ్ర పదజాలంతో దూషించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘అయిపాయ్.. పాపం పండింది’ అంటూ వైరల్ చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!
వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..
రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..
రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..
ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!
సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!
మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: