LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Home Minister Anita: చల్లపల్లి పేలుడు ఘటనపై హోం మంత్రి సమీక్ష.. ధైర్యంగా ఉండండి.. మేమున్నాం.!

Home Minister Anita: చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు ఘటనలో గాయాలైన పోలీసులను ప‌రామ‌ర్శించిన‌ హోం మంత్రి అనిత.

AndhraPravasi News Desk 1 min read
Home Minister Anita: చల్లపల్లి పేలుడు ఘటనపై హోం మంత్రి సమీక్ష.. ధైర్యంగా ఉండండి.. మేమున్నాం.!
  • కానిస్టేబుల్ అబ్దుల్లాకు 60 శాతం గాయాలు: ఎన్ఆర్ఐ వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి..
     
  • Politics: క్షతగాత్రుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్న కృష్ణా జిల్లా ఎస్పీ: బాధితులకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు..

Mangalagiri Home Minister Anita: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని ఆమె ప‌రామ‌ర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయాలైన పోలీసులకు ధైర్యం చెప్పిన మంత్రి, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల నుంచి సీజ్ చేసిన పేలుడు పదార్థాలను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనలో ఎస్సై, కోర్ట్ కానిస్టేబుల్ మరియు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడినట్లు వివరించారు. అబ్దుల్లా అనే కానిస్టేబుల్‌కు 50-60 శాతం గాయాలున్నాయని, మిగతా వారికి ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గాయపడిన పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి, వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…