టీడీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, అనవసరమైన విషయాలు చెప్పొద్దని సూచించారు. మనం పొరపాటున మాట్లాడితే ప్రతిపక్షం దాన్ని అవకాశంగా తీసుకుంటుందన్నారు. 2019 ఎన్నికల సమయంలో వివేకా హత్యపై "నారా సుర రక్త చరిత్ర" అని ప్రచారం చేసి, దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: 2026 తర్వాత పెరిగే లోక్ సభ సీట్లివే ? రాష్ట్రాల వారీగా ఇలా..!
ఆ సమయంలో సరిగ్గా ఎదుర్కోలేకపోయామని, ఈ కుట్ర వల్ల వివేక కుమార్తె సునీత కూడా తొలుత నిజమని నమ్మిందని, కానీ ఆ తర్వాత నిజం తెలుసుకుని కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. నాటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ కుట్రను పసిగట్టలేకపోయిందన్నారు. ఇప్పటికీ జగన్ అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, జగన్ ఇంటి దగ్గర చెత్త తగలబడితే కూడా దాన్ని రచ్చ చేయాలని చూశారని విమర్శించారు. ఏప్రిల్‌లోపు నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామని, పార్టీ పదవులను మహానాడులోపు ఖరారు చేయాలని సూచించారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి సమష్టిగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..
నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్.. అనంతరం ఉదయం 10 గంటలకు..
పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..
భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..
వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..
హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్ అయ్యాయో తెలుసా?
కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: