గణేష్ చవితి హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఈ ఏడాది గణేష్ చతుర్థి 2025 ఆగస్టు 27వ తేదీ, బుధవారం జరగనుంది. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ పండుగను భక్తి, భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక వేడుకలతో ఘనంగా జరుపుకుంటారు.
ప్రతి సంవత్సరం లాగే కుటుంబాలు, విద్యార్థులు ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా వేడుకల్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఆ రోజున పాఠశాలలకు సెలవు వస్తుందా లేదా అన్న ఆశక్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే 2025లో గణేష్ చతుర్థి రోజున పాఠశాలలు అధికారికంగా మూసివేయబడతాయా? లేక పాఠాలు సాధారణంగానే కొనసాగుతాయా? అన్న ప్రశ్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లో చర్చనీయాంశంగా మారింది.