పండగలు వస్తే చాలు, ఆన్‌లైన్ సేల్స్, భారీ ఆఫర్ల కోసం ఎదురుచూసేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ దీపావళికి షావోమీ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ ఇండియా 'Diwali with Xiaomi Sale 2025' పేరుతో భారీ ఫెస్టివల్ సేల్ ఆఫర్లను ప్రకటించింది.
ఈ సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు, పవర్‌బ్యాంక్‌లు సహా అనేక ఉత్పత్తులపై ఏకంగా 60% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్లు mi.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్స్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లపై భారీ డిస్కౌంట్లు..
ఈ దీపావళి సేల్‌లో షావోమీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌లపై ఎవరూ ఊహించనంత భారీ ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా, రెడ్‌మీ నోట్ 14 సిరీస్ ఫోన్లపై మంచి తగ్గింపులు లభిస్తున్నాయి.

Redmi Note 14 Pro+ 5G: రూ. 34,999 నుంచి రూ. 24,999
Redmi Note 14 Pro 5G: రూ. 28,999 నుంచి రూ. 20,999
Redmi Note 14: రూ. 21,999 నుంచి రూ. 15,499
Redmi A4 5G: రూ. 8,499 నుంచి రూ. 7,499
Redmi 14C: రూ. 9,999 నుంచి రూ. 8,999
అద్భుతమైన ఫీచర్లు, భారీ కెమెరా సెటప్, లాంగ్ బ్యాటరీలతో ఈ ఫోన్లు చాలా మంచి ఆఫర్లలో లభిస్తున్నాయి.
అలాగే, వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ చదువులకు అనువైన షావోమీ, రెడ్‌మీ టాబ్లెట్‌లపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
Xiaomi Pad 7: రూ. 34,999 నుంచి రూ. 22,999
Xiaomi Pad Pro: రూ. 24,999 నుంచి రూ. 16,999
Redmi Pad 2: రూ. 13,999 నుంచి రూ. 11,999
స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులపై ఆఫర్లు..
ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పంచే బిగ్ స్క్రీన్ షావోమీ, రెడ్‌మీ స్మార్ట్ టీవీలు ఈ సేల్‌లో ప్రత్యేక తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి.
CineMagiQLED X Pro Series: రూ. 44,999 నుంచి రూ. 25,999
FantastiQLED FX Pro Series: రూ. 44,999 నుంచి రూ. 21,999
వీటితో పాటు, ఇతర స్మార్ట్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై కూడా ఆఫర్లు ఉన్నాయి.
Redmi Watch Move: రూ. 1,699
Redmi Buds 5C: రూ. 1,799
Xiaomi Air Purifier 4 Lite: రూ. 12,999
ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా, బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 5,000 వరకు అదనపు డిస్కౌంట్, అలాగే జీరో డౌన్ పేమెంట్, నో-ఇంట్రెస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
కస్టమర్ సర్వీసులో కూడా షావోమీ ముందుంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సర్వే ప్రకారం, షావోమీ ఆఫ్టర్-సేల్స్ సర్వీస్‌లో టాప్‌లో ఉంది. కేవలం 4 గంటల్లోనే 52% సమస్యలను పరిష్కరించడంలో, 37% రిపేర్ ఖర్చులను రూ. 1,000 లోపే ముగించడంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. మొత్తంగా, ఈ పండగ సీజన్‌లో షావోమీ ఇండియా సేల్, తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఉత్పత్తులను కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం.