
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీనిలోనూ రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ప్రభుత్వం 2026 నాటికి వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పోర్టులకు రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానం చేస్తూ, పొరుగు రాష్ట్రాలకు సేవలను విస్తరించాలనుకుంటున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఒడిశాలో డ్రైపోర్టులు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. సముద్ర తీరం వెంబడి ప్రతి 50 కి.మీ.లకు ఒక పోర్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. మొత్తంగా, 20 కొత్త పోర్టులను రాష్ట్రంలో స్థాపించే లక్ష్యం ఉంది.
రామాయపట్నం పోర్టు నిర్మాణం 69% పూర్తయింది. 2026 జూన్‌లో ఈ పోర్టు వినియోగంలోకి రానుందని అంచనా. కేప్ సైజు నౌకల కోసం డ్రెడ్జింగ్ పరిధిని 16 నుంచి 18.5 మీటర్లకు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం చర్చలో ఉంది.
మచిలీపట్నం పోర్టు 45.5% పూర్తయింది, 2026 నవంబర్‌లో పూర్తి చేయాలని లక్ష్యం. మొదటి దశలో 4 బెర్తులు ఉంటాయి, భవిష్యత్తులో 16 కు పెంచవచ్చు. ఈ పోర్టు ద్వారా ఏడాదికి 36 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యమవుతుంది. మూలపేట పోర్టు నిర్మాణం 54.01% పూర్తయింది, 2026 మే నాటికి పూర్తి చేయడం లక్ష్యం.
ప్రభుత్వం అన్ని పోర్టులను ట్రయల్ రన్ కోసం సిద్ధం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. వీటి ద్వారా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి పెద్ద దోహదం అవుతుంది.