ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..? ముందుగానే ప్లాన్ చేసుకోండి..

ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ఇటీవల విజయవంతంగా ముగిసిన బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత మరొక భారీ ఆఫర్ల పండుగకు తెరలేపింది. ఈసారి బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ 2025 పేరుతో వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ సేల్ అక్టోబర్ 3 అర్థరాత్రి ప్రారంభమై అక్టోబర్ 8 వరకు కొనసాగనుంది. బిగ్ బిలియన్ డేస్‌లో లభించిన ఎక్కువ శాతం ఆఫర్లు మళ్లీ ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఆ సమయంలో ఆఫర్లను ఉపయోగించుకోలేని కస్టమర్లకు ఇది మరోసారి బంపర్ ఛాన్స్ అని కంపెనీ చెబుతోంది.

Ambani: అంబానీ వాదనలు తిరస్కరించిన హైకోర్టు..! రిలయన్స్ కమ్యూనికేషన్స్ కష్టాల్లో..!

ఈ సేల్‌లో వినియోగదారులను ప్రధానంగా ఆకర్షించబోయే అంశం స్మార్ట్‌ఫోన్ డీల్స్. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.60,000 లోపు ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా సాంసంగ్ గెలాక్సీ S24 (స్నాప్‌డ్రాగన్ వెర్షన్), మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ వంటి ప్రీమియమ్ మోడళ్లపై కూడా ప్రత్యేక తగ్గింపులు అందిస్తున్నాయి. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అదనపు బోనస్ కూడా పొందవచ్చు. దీంతో కొత్త ఫోన్లను మరింత తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు.

AP Nominated Posts: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవాలయాలకు పాలకమండలి నియామకం! జాబితా ఇదే.!

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టెలివిజన్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాలపై 40 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో సోనీ, ఎల్‌జీ, సాంసంగ్, ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా పాల్గొంటున్నాయి. ఖరీదైన ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయడానికి 3 నెలల నుంచి 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా కల్పించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (గరిష్టంగా రూ.1,500) అందుబాటులో ఉంటుంది.

NASA operations: నాసా' ఆపరేషన్స్ నిలిపివేత.. కారణమిదే.. గత ఆరేళ్లలో మొదటిసారి!

ఫ్లిప్‌కార్ట్ ఈ కొత్త సేల్‌ను దసరా, దీపావళి పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసింది. పండుగల సమయంలో షాపింగ్‌ చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంతో ఈ సేల్ వారికి మరింత అనుకూలంగా ఉండబోతోంది. పండుగల సమయంలో అవసరమైన గాడ్జెట్లు, గిఫ్టులు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేసే సువర్ణావకాశం ఇది. గత సారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను మిస్ అయిన వినియోగదారులు ఈసారి ఏకంగా అన్ని ఆఫర్లను తిరిగి సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ అంచనా ప్రకారం ఈ సేల్ ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్‌ను మరింత కదిలించబోతోంది.

ఉపాసన గర్భవతి అంటూ వైరల్ అవుతున్న వీడియో… రామ్ చరణ్ సపోర్ట్ చేస్తూ కనిపించడంతో అభిమానుల్లో ఖుషీ ఓవర్‌లోడ్!!!
ఫిబ్రవరి 23 నుండి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం – పూర్తి షెడ్యూల్ విడుదల!
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మస్క్ రీట్వీట్ వివాదం! నెటిజన్ల ఆగ్రహం!!
Milk Powder Making: మీకు ఇది తెలుసా! పిల్లల కోసం ఇంట్లోనే సురక్షితమైన పాల పొడి.. తయారీ విధానం!
Cabinet Beti: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..! పలు రంగాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!
walking 30 minutes: రోజూ 30 నిమిషాల నడక ఆరోగ్యానికి అద్భుత ఫలితాలు.. గుండె జబ్బుల ప్రమాదాన్ని 35% తగ్గించగల!