దేశవ్యాప్తంగా కరోనా మరోసారి కంగారుపెడుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్నంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంతలో ఒక వ్యక్తి కరోనాతో చనిపోయారనడంతో ఆందోళన మొదలైంది. హెచ్‌బీ కాలనీకి చెందిన 64 ఏళ్ల వ్యక్తి అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు న్యుమోనియా, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయి.. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆయనకు టెస్ట్‌లు నిర్వహించగా కరోనా పాజిటివ్ తేలింది. ఇంతలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయారు. దీంతో ఆయన కరోనాతో చనిపోయారంటూ ప్రచారం జరిగింది.
కరోనాతో చనిపోయారని ప్రచారం చేస్తున్న వ్యక్తికి న్యుమోనియా, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటున్నారు. ఆయన మూడు రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందన్నారు. అలాగే ఆయనకు పార్కిన్‌సన్స్ వ్యాధి కూడా ఉందన్నారు డాక్టర్లు. ఆయన వయసు మీద పడటంతో పాటుగా అనారోగ్య కారణాలతో పరిస్థితి విషమించి గురువారం ఉదయం 7.41 గంటలకు చనిపోయినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు జ్ఞానాపురం శ్మశానవాటికలో అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు.
కరోనాతో ఒకరు చనిపోయారనే ప్రచారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగదీశ్వరరావు స్పందించారు. విశాఖపట్నంలో కరోనా కారణంగా ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. నగరంలో నమోదైన మూడు కేసుల్లో అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఓ వృద్ధుడు కరోనాతో చనిపోయారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆయన అనారోగ్యంతో పాటుగా ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయారంటున్నారు. కరోనా కారణంగా చనిపోయారని ధ్రువీకరించాలంటే.. విశాఖపట్నం కేజీహెచ్‌లోని ఉన్న వీడీఆర్‌ఎల్ లేబొరేటరీలో ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ రావాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అయితే అక్కడ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారు ఎవరూ చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు. కరోనా కాకుండా ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయారు అంటున్నారు.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!
చిక్కుల్లో కమల్ హాసన్.. బెంగళూరులో కేసు నమోదు! ఆయన వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం..
ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!
కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: