USA: అమెరికాలో ఘోరం జరిగింది. డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ఓ దుండగుడు భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపేశాడు. వర్జీనియాలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లోకి గన్‌తో చొరబడిన దుండగుడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్ (56), ఆయన కుమార్తె ఊర్మి (24) తీవ్రంగా గాయపడ్డారు. ప్రదీప్ ఘటనాస్థలిలోనే మృతిచెందగా... తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఊర్మి చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్ (44)ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ సంచలనం.. యూఎస్ నుంచి 5 లక్షల మంది బహిష్కరణ.. మాస్టర్ ప్లాన్.?
కాగా, గురువారం ఉదయం మద్యం కొనుగోలు చేసేందుకు డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కు వెళ్లిన నిందితుడు... ముందురోజు రాత్రి ఎందుకు మూసేశారని ప్రశ్నించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ప్రదీవ్ పటేల్, ఊర్మిపై కాల్పులకు తెగబడ్డాడు. గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాకు చెందిన ప్రదీప్ పటేల్.. తన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ తన బంధువు పరేశ్ పటేల్‌కు చెందిన డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు. పరేశ్ పటేల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ... "మా సోదరుడి భార్య, ఆమె తండ్రి షాపులో పనులు చేసుకుంటుండగా ఒకరు వచ్చి కాల్పులు జరిపాడు. ఏం జరిగిందో నాకు తెలియదు"అని అన్నారు. హతుడు ప్రదీప్ పటేల్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిలో ఒకరు అహ్మదాబాద్, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు. ఈ జంట హత్య అమెరికాలోని భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇది కూడా చదవండి: ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా సిద్ధం! కీలక పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు! సీఎం వద్దకు ఫైనల్ లిస్టు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు - ఏ-1గా మాజీ మంత్రి.! పోలీస్ రంగం సిద్దం - ఈ కేసులో మరో కీలక అంశం!
వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! పింఛన్ లో కొత్త మలుపు..
టీటీడీ కీలక అప్డేట్.. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్! ఇలా చేయండి, లేకపోతే పథకాలు రావు, సరుకులు కట్!
ఆంధ్రప్రదేశ్‌లో క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. అల ఆకాశంలో.. జాలీ జాలీగా ప్రయాణం.!
అమెరికా: భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన.. కచ్చితంగా అలా చేయాల్సిందే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: