ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం రూ.788 కోట్లు విడుదల చేసింది. తాజాగా మరో రూ.600 కోట్లు విడుదల చేయడంతో, విద్యార్థులకు ఆర్థిక సహాయం మరింత వేగవంతమైంది. త్వరలోనే అదనంగా మరో రూ.400 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని, ఫీజుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. విద్యార్థులను తరగతులకు హాజరుకాకుండా చేయడం, హాల్ టికెట్లను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటే సంబంధిత విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు తమ పరిధిలోని విద్యాసంస్థల్లో ఈ విధమైన ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి! ఆసిఫ్ మృతికి గల కారణాలు.!
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం! తరిగొండ వెంగమాంబ సత్రంలో..
రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!
చీప్.. వెరీ చీప్.. రూ. 599కే ఎయిర్ ఇండియా టికెట్.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!
జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: