ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టులు జరుగుతుండగా, ఇప్పుడు మాజీ మహిళా మంత్రి విడదల రజనీపై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది. మంత్రిగా ఉన్న సమయంలో, గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్ల మేర అక్రమ వసూళ్లు చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ మంత్రితో పాటు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, రజనీ మరిది విడదల గోపి, ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణ కూడా నిందితులుగా చేర్చారు.
ఇది కూడా చదవండి: ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా సిద్ధం! కీలక పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు! సీఎం వద్దకు ఫైనల్ లిస్టు!
ఈ కేసులో రజనీ కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఆమె స్వయంగా స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించడంతో పాటు, తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాదు, అప్పటి విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా, ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. ప్రాధమిక ఆధారాలు లభించడంతో, విచారణ మరింత వేగంగా కొనసాగుతున్నట్టు సమాచారం. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ సెక్షన్లతో పాటు, ఐపీసీ 384, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ కేసులో మరో కీలక అంశం, అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి లేకుండానే ఐపీఎస్ అధికారి జాషువా స్టోన్ క్రషర్‌ను తనిఖీ చేయడం. విజయలక్ష్మి స్టోన్ క్రషర్ యజమానులు రజనీ పీఏ రామకృష్ణ ద్వారా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంపై ఫిర్యాదులు వచ్చాయి. తొలుత రూ.50 కోట్ల జరిమానా విధిస్తామంటూ బెదిరింపులు జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏసీబీ సీరియస్‌గా దర్యాప్తు చేపట్టింది. దీంతో, రజనీ సహా ఇతర నిందితులపై ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! పింఛన్ లో కొత్త మలుపు..
కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!
విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...
రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!
ట్రంప్ సంచలనం.. యూఎస్ నుంచి 5 లక్షల మంది బహిష్కరణ.. మాస్టర్ ప్లాన్.?
ఆంధ్రప్రదేశ్‌లో క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. అల ఆకాశంలో.. జాలీ జాలీగా ప్రయాణం.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: