LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravathi: అమరావతిపై తప్పుడు ప్రచారం.. నిజాలు బయటపెట్టిన మంత్రి నారాయణ!

Amaravathi: అమరావతి రాజధాని అంశంపై వైసీపీ తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలను వివరించారు.

AndhraPravasi News Desk 2 min read
Amaravathi: అమరావతిపై తప్పుడు ప్రచారం.. నిజాలు బయటపెట్టిన మంత్రి నారాయణ!

అమ‌రావ‌తి వంద‌శాతం సెల్ఫ్ స‌స్టెయిన‌బుల్ సిటీ..

మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు..

విజయవాడ: అమరావతి రాజధాని అంశంపై వైసీపీ తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలను వివరించారు.

అమరావతిపై అవినీతి జరుగుతోందని చెప్పడం పూర్తిగా అసత్యమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సెక్రటేరియట్, పార్లమెంట్ భవనాల నిర్మాణ ఖర్చులతో పోల్చి చూస్తే అమరావతిలో నిర్మాణ వ్యయం సహజంగానే ఉందని వివరించారు. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి సుమారు ₹1,423 కోట్లు ఖర్చై చదరపు అడుగుకు ₹13,763 వ్యయం అయ్యిందని, అలాగే పార్లమెంట్ భవనానికి ₹1,174 కోట్లు ఖర్చై చదరపు అడుగుకు ₹16,916 వ్యయం అయ్యిందని చెప్పారు.

అయితే అమరావతిలో కేవలం భవనాలు మాత్రమే కాకుండా రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి పైప్‌లైన్లు, విద్యుత్ లైన్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కలిపి నిర్మాణం జరుగుతుండటంతో ఖర్చు ఎక్కువగా కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాజధాని గురించి మాట్లాడుతున్నారని, గతంలో అసెంబ్లీలో గుంటూరు–విజయవాడ రాజధానిని అంగీకరించిన వారు, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల మాట తీసుకువచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేశారని విమర్శించారు. రైతులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

అమరావతిని కదిలించలేమని తెలుసుకుని ‘మావిగన్’ పేరుతో కొత్త గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ పేరును వింటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

నిర్మాణ వ్యయం పెరగడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని మంత్రి తెలిపారు. అప్పట్లో జీఎస్టీ 12% ఉండగా ఇప్పుడు 18%కి పెరిగిందని, బిటుమెన్, స్టీల్, మెటల్ ధరలు గణనీయంగా పెరిగినట్లు వివరించారు. టెండర్లు అన్నీ ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే పిలుస్తున్నామని చెప్పారు.

అమరావతిలో ఒకే వర్గానికి కాంట్రాక్టులు ఇచ్చారన్న ఆరోపణలు కూడా అసత్యమని, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు.

రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో పెద్ద ఎత్తున పురోగతి సాధించామని తెలిపారు. మొత్తం 31,158 మంది రైతుల్లో 30,074 మందికి ప్లాట్లు కేటాయించామని, 62,942 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందని చెప్పారు.

అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల నివాసాలు దాదాపు పూర్తి అయ్యాయని, మరికొన్ని భవనాలు త్వరలో పూర్తి అవుతాయని తెలిపారు. 2028 ఆగస్టు నాటికి బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తవుతుందని మంత్రి నమ్మకం వ్యక్తం చేశారు.

అమరావతిని సెల్ఫ్ సస్టెయినబుల్ సిటీగా రూపకల్పన చేశామని, భవిష్యత్తులో భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చగలమని, ప్రజలపై పన్నుల భారం వేయబోమని హామీ ఇచ్చారు.

చివరగా, “చంద్రబాబుకు విజన్ ఉంది… జగన్ మాత్రం విషం పంచుతున్నారు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు మంత్రి నారాయణ. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని, పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…