ఈ రోజుల్లో యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు. రాజకీయ నాయకుడి కొడుకు మళ్లీ అదే రంగంలోకి వస్తున్నాడు. అందుకే మన దేశంలో నెపోటిజంపై చర్చ ఎప్పుడూ జరుగుతుంది. కానీ, ప్రముఖుల వారసులు కొందరు మాత్రం, చెత్త పనులు చేస్తూ కుటుంబానికి షాక్ ఇస్తున్నారు. తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు చేసిన పని తెలిసి, అందరూ షాక్ అవుతున్నారు. గర్ల్‌ఫ్రెండ్ కోసం అతడు దొంగగా మారి ఫ్యామిలీ పరువును మంటగలిపాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల అహ్మదాబాద్‌లో దొంగతనం జరిగింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్‌లో అతడు మాజీ ఎమ్మెల్యే విజేంద్ర సింగ్ చంద్రావత్ కుమారుడు ప్రద్యుమ్న సింగ్ చంద్రావత్ అని తేలింది. విజేంద్ర మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలోని మానస అసెంబ్లీ స్థానం నుంచి గతంలో పోటీ చేసి గెలిచారు. గత నెల 25న ప్రద్యుమ్న ఓ మహిళ మెడ నుంచి గోల్డ్ చైన్‌ను లాక్కెళ్లాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇంకా చదవండి: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై కీలక అప్‌డేట్! బ్యాంకర్లతో సీఎం కీలక భేటీ!
కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుణ్ని గుర్తించి అరెస్టు చేయగా, అసలు విషయాలు బయటకు వచ్చాయి. తన గర్ల్‌ఫ్రెండ్ అవసరాలు తీర్చడం కోసమే దొంగగా మారాల్సి వచ్చిందని ప్రద్యుమ్న చెప్పాడు. తనకు నెలకు రూ.15,000 జీతం వస్తుందని, ఆ మొత్తంలో తన గర్ల్‌ఫ్రెండ్ లగ్జరీ అవసరాలు తీర్చలేకపోతున్నానని పోలీసులకు చెప్పాడు. అందుకే చైన స్నాచర్‌గా మారినట్లు వెల్లడించాడు. ఎమ్మెల్యే కొడుకు అయినా సరే, తాను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశానని ప్రద్యుమ్న పోలీసులకు చెప్పాడు. అహ్మదాబాద్‌లో నెలకు రూ.15,000 జీతానికి ఒక చోట పనిచేస్తున్నట్లు తెలిపాడు. ఆ సమయంలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డట్లు చెప్పాడు. కేవలం ఆమె అవసరాలు తీర్చడం కోసమే దొంగగా మారినట్లు అంగీకరించాడు. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు బయటకు విడుదల చేయడంతో అసలు విషయం అందరికీ తెలిసింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.
ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి షాక్ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!
ఆ స్టార్ హీరో, డైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?
ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!
తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!
సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!
ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్ మామూలుగా లేదుగా!
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: