ఫిబ్రవరి 4వ తేది రథసప్తమి (సూర్య జయంతి) సందర్భంగా తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లను పూర్తి చేసింది టీటీడీ. తిరుపతిలో తొక్కిసలాట ఘటన పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వస్తుంది. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు టీటీడీ అధికారులు. రథ సప్తమి రోజున 2 - 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాధారణంగా రోజుకి 25 వేల టైం స్లాట్ టికెట్స్ జారీ చేస్తూ ఉంటుంది టీటీడీ.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రత్యేక పర్వదినాల్లో ఈ టోకెన్ల జారీ ప్రక్రియ తాత్కాలికంగా నిలుపుదల చేస్తుంటుంది టీటీడీ. రథసప్తమి నాడు శ్రీవారి దర్శన భాగ్యంతో పాటుగా…. వాహన సేవలు తిలకించేందుకు భారీ స్థాయిలో భక్తులు వస్తారని అంచనా చేస్తున్నారు. కౌంటర్ల వద్ద భారీ స్థాయిలో భక్తులు చేరుకొని తోపులాట సాగె అవకాశం ఉంది. ఈ కారణంగా టీటీడీ ఫిబ్రవరి 3 నుండి 5వ తేది వరకు ఎస్ఎస్ డి టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేయనుంది. సామాన్య భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకొని శ్రీవారిని దర్శించుకునే విధంగా చర్యలు చేపట్టింది. టైం స్లాట్ టోకెన్స్ తో పాటుగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బడ్జెట్-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!
ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..
మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2కోట్ల వరకు రుణాలు!
రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..
అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!
చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్ పోస్టులపై చర్చ!
చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్ పోస్టులపై చర్చ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: