తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఈ ఏడాది అకాడమిక్ క్యాలెండర్‌లో పండుగే పండుగ. పాఠశాలలకు 80 రోజులకు పైగా సెలవులు రానున్నాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్‌తో పాటు ఆదివారాలు, రెండో శనివారాలు, పబ్లిక్ హాలీడేలతో విద్యార్థులకు డబుల్ ధమాకా హాలీడేస్ లభించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉంటే, క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ప్రకటించారు. ఇక జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి హాలీడేస్, డిసెంబర్ 21 నుంచి 28 వరకు క్రిస్మస్ హాలీడేస్ ఉండనున్నాయి.
తెలంగాణలో విద్యార్థులకు ఈసారి దసరా సెలవులు మరింత భారీగా రానున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా బ్రేక్ ఇచ్చారు. అదనంగా సెప్టెంబర్ 5న మీలాద్ ఉన్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలీడే ప్రకటించారు. ఇలా మొత్తంగా ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్‌తో పాటు 83 హాలీడేస్ విద్యార్థులను అలరించనున్నాయి.