ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (USA President Donald Trump) కాళ్లల్లో వాపు సమస్యపై శ్వేత సౌధం తాజాగా స్పందించింది. ఇది సిరల్లో కనిపించే సాధారణ సమస్య అని, 70 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (Deep vein thrombosis) లేదా ఆర్టీరియల్ సమస్యలు (Blood clots) వంటివి ఉన్నాయనేందుకు ఆధారాలేవీ లేవని తెలిపింది. గుండె, కిడ్నీ, ఇతర సమస్యలు కూడా ఏమీ లేనట్టు పరీక్షల్లో తేలిందని వెల్లడించింది. ప్రస్తుతం ట్రంప్‌కు కాళ్ల వాపు కారణంగా ఎలాంటి అసౌకర్యం లేదని కూడా వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్ వైద్యుడు రాసిన లేఖను శ్వేత సౌధం అధికారి మీడియాకు వెల్లడించారు. ట్రంప్ చేతి వెనక వైపు, వీపుపై కాస్త కందిపోయినట్టు ఉందని కూడా ఆయన వైద్యుడు తెలిపారు.
ఇది కూడా చదవండి: Chandrababu Meeting: భవిష్యత్తు శక్తికి కొత్త దారి.. తక్కువ ఖర్చుతో గ్రీన్ ఎనర్జీ సాధ్యం! నూతన దిశలో ఏపీ ప్రయాణం!
అయితే, ఆస్పిరిన్ వంటి ఔషధాలు వాడేటప్పుడు ఇలాంటివి తలెత్తుతాయని అన్నారు. వైద్య వర్గాలు చెప్పేదాని ప్రకారం, క్రానిక్ వీసన్ ఇన్‌సఫిషియన్సీ (Chronic venous insufficiency) అనే సమస్య కారణంగా ట్రంప్ కాళ్లల్లో వాపు కనిపించింది. సిరల్లో రక్త సరఫరా సాధారణ స్థాయిలో జరగనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. సిరల్లోని కవాటాలు సరిగా పనిచేయకపోతే రక్తం గుండెకు పూర్తిస్థాయిలో చేరదు. దీంతో, కాళ్లల్లో పేరుకుపోయే రక్తంతో వాపు కనిపిస్తుంది. వృద్ధుల్లో సాధారణంగా కనిపించే సమస్యే అయినా ఒక్కోసారి పరిస్థితి జటిలమయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే, తొలి దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే వ్యాధి ముదిరే అవకాశాలు తక్కువ. వ్యాయామం చేస్తే కూడా ఉపశమనం కనిపిస్తుంది. కొన్ని సార్లు శస్త్ర చికిత్స కూడా చేయాల్సి రావొచ్చు.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Annavaram Temple: అన్నవరం ఆలయంలో షాక్! దేవస్థాన నిబంధనలు ఉల్లంఘన – అర్చకుడు సస్పెండ్!
Delhi Schools: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు! వారంలోనే ఇది మూడోసారి!
Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: