తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని దేశంలోనే కాకుండా విదేశాలలోనూ శ్రీనివాస కల్యాణాలను నిర్వహిస్తోంది. విదేశాల్లో నివసించే తెలుగు ప్రజలు, భక్తులు తిరుమలకు రాలేకపోయినా, వారికి శ్రీనివాసుడి సేవ, అనుభూతి చేరేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులకు తిరుమల దేవాలయ వైభవం, సంస్కృతి, సంప్రదాయాలు పరిచయం కావడం కూడా ఈ కార్యక్రమాల వెనుక ముఖ్యమైన కారణం. ఈ మహోత్సవాల ద్వారా ఈ తరం పిల్లలకు సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని దగ్గర చేయడం, కుటుంబ బంధాలను బలపరచడం జరుగుతోంది.
ఈ సంవత్సరానికి గాను యూరప్‌లోని 16 నగరాలలో కల్యాణాలు నిర్వహించేందుకు TTD నిర్ణయం తీసుకుంది. టీటీడీ మరియు ఏపీఎన్నార్టీ సంయుక్తంగా ఈ కళ్యాణాలను నిర్వహించనున్నారు. దీనికి సంబందించిన కళ్యాణాల షెడ్యూల్ పోస్టర్ ను రిలీస్ చేయడం జరిగింది.
ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ NRI, MSME, SERP మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ జర్మనీ కూడా సందర్శించారు. ఫ్రాంక్ఫర్ట్ లో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళ్యాణాల షెడ్యూల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రిగారితో పాటు సుమంత్ కొర్రపాటి, టిట్టు మద్దిపట్ల, కృష్ణ జావాజి, సూర్య వెలగ, నరేష్ కోనేరు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ వేమూరు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచిరాం ప్రసాద్ లాంఛనప్రాయంగా తాడేపల్లిలోని APNRT కార్యాలయంలో కళ్యాణాల షెడ్యూల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఐర్లాండ్ నుండి వచ్చిన కాట్రగడ్డ కృష్ణప్రసాద్, జర్మని నుండి వచ్చిన శ్రీకాంత్ కుడితిపూడి పాల్గొన్నారు.
దీనికి సంబందించిన పూర్తి సమాచారాన్ని ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్న ఐర్లాండ్ లోని డాక్టర్ చలసాని కిశోర్ బాబు కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈ కళ్యాణాలు పలు దేశాలలో 16 నగరాలలో జరగనున్నాయని. ఉచిత సర్వదర్శనం కార్యక్రమంలో భాగంగా యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అనేక తెలుగు సంఘాలు మరియు దేవాలయాలు ప్రత్యేక ఆధ్యాత్మిక సమావేశాలను నిర్వహిస్తున్నామని. మొత్తం 16 ప్రదేశాల వివరాలు, తేదీలు మరియు నిర్వాహూకల వివరాలు ఈ ఒక ప్రకటనలో తెలియచేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
వివిధ నగరాలలో కళ్యాణాలకు కావలసిన లడ్డులు, తీర్థ ప్రసాదాలు, పూజ సామగ్రి, పూజారుల వీసా వ్యవహారాలు, వారికి ఆతిధ్యం మరియు రాకపోకలకు ఏర్పాట్లు, లాజిస్టిక్స్ వంటివి అన్నీ చేస్తూ సమన్వయకర్తలుగా కాట్రగడ్డ కృష్ణప్రసాద్, విజయ్‌కుమార్ అడుసుమిల్లి, సురేష్ కోరం, శ్రీను వావిలాల, గోగినేని శ్రీనివాస్, నరేష్ కోనేరు, శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి వ్యవహరిస్తున్నారు.
1- 13/09/2025 – UK
శ్రీ శ్రీనివాస (బాలాజీ) అసోసియేషన్ ఆఫ్ మిల్టన్ కీన్స్
స్థలం: డెన్బిగ్ స్కూల్, బర్చర్డ్ క్రెసెంట్, షెన్‌లే చర్చి ఎండ్, మిల్టన్ కీన్స్, MK5 6EX, యునైటెడ్ కింగ్‌డమ్.
నిర్వాహకులు: Lokanandha, Vikram Paritala
+44 7769339470, +44 7502984267
2- 14/09/2025 – UK
తెలుగు అసోసియేషన్ ఆఫ్ బేసింగ్‌స్టోక్
స్థలం: క్వీన్ మేరీస్ కాలేజ్, క్లిడ్డెస్డెన్ రోడ్, బేసింగ్‌స్టోక్ RG21 3HF, యునైటెడ్ కింగ్‌డమ్.
నిర్వాహకులు: Arun Mummlaneni, Sreeni Vavilala, Vijaya Kumar L
+44 7917620782, +44 7894708983, +44 7979365433
3- 20/09/2025 – UK
శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవ సమితి
స్థలం: 36 అలెగ్జాండ్రా రోడ్, బర్లే, లీడ్స్ LS6 1RF మందిర్, యునైటెడ్ కింగ్‌డమ్.
నిర్వాహకులు: Vijay Kumar Addusumilli, Ambikeswara Rao Chaliki
+44 7813536019, +44 7895555457
4- 21/09/2025 – Ireland
ఐర్లాండ్ తెలుగు సమాజం (ITS)
స్థలం: లీ చైల్ సెకండరీ స్కూల్, టైర్‌రెల్‌స్టౌన్, డబ్లిన్, D15 H2CP, ఐర్లాండ్.
నిర్వాహకులు: Nanda Kishore Dontineni, Vishnu Reddy Doodipala
+353 89 9729344, +353 89 9610925
5- 27/09/2025 – UK
శ్రీ వైకుంఠం మాంచెస్టర్
స్థలం: జైన్ కమ్యూనిటీ సెంటర్, 667/669, స్టాక్‌పోర్ట్ రోడ్, మాంచెస్టర్, M12 4QE, యునైటెడ్ కింగ్‌డమ్.
నిర్వాహకులు: Sekhar Vemuri, Sula Pani Vemuri
+44 7886029473
6- 04/10/2025 – UK
గ్రేటెస్ట్ లండన్ తెలుగు అసోసియేషన్
స్థలం: కెంట్ షో గ్రౌండ్, డెట్లింగ్, మేడ్స్‌టోన్, కెంట్ ME14 3JF, యునైటెడ్ కింగ్‌డమ్.
నిర్వాహకులు: Dr. Sambasiva Rao Sajja, Ram Katrapati
+44 7584014508, +44 7411861089
7- 04/10/2025 – Switzerland
స్విస్ వెదిక్ భక్తి ఫౌండేషన్ (SVBF)
స్థలం: శ్రీ విష్ణు తుర్కై అమ్మన్ టెంపుల్, ఎడికర్‌స్ట్రాస్ 24, 8635 డ్యూర్న్‌టెన్, స్విట్జర్లాండ్.
8- 05/10/2025 – Northern Ireland
నార్తర్న్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్
స్థలం: షాఫ్ట్స్‌బరీ కమ్యూనిటీ సెంటర్, బెల్‌ఫాస్ట్ BT7 2EW, నార్తర్న్ ఐర్లాండ్.
నిర్వాహకుడు: Ramesh Gummadavelli
+44 7568509288
9- 05/10/2025 – France
శ్రీ వెంకటేశ్వర ఆలయం
స్థలం: సాల్ స్పోర్టిఫ్, జిమ్నాస్ కోలెట్ బెస్సన్, 26, ర్యూ డూ ప్లెసిస్ బ్రియార్డ్, 91080 ఎవ్రి-కోర్కౌరొన్నెస్, ఫ్రాన్స్.
నిర్వాహకుడు: Cannabirane
+33 68905181
10- 12/10/2025 – Germany
శ్రీ వెంకటేశ్వర మందిర్ హాంబర్గ్ (SVMH) e.V
స్థలం: గ్రుంద్‌షూల్ న్యూగ్రాబెన్, ఫ్రాంకోపర్ స్ట్రా. 32, 21147 హాంబర్గ్, జర్మనీ.
నిర్వాహకులు: Brahmasivasenkar Lingam, Shashdhar Amireddy, Vamsi Krishna Dasari
+49 17645897395, +49 17780007777, +49 17641632610
11- 18/10/2025 – Poland
పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA)
స్థలం: ఉల్. బోబ్రోవియెకా 9, షోపిన్ హాల్, 00-728, వార్సా, పోలాండ్.
నిర్వాహకులు: Chandra Akkala, Hari Chand Katragadda
+48 791976963, +48 667695940
12- 19/10/2025 – Germany
తెలుగు అసోసియేషన్ జర్మనీ e.V
స్థలం: పైనాపిల్ పార్క్, ఆర్నుల్ఫ్‌స్ట్రాస్ 195-199, 80634 మ్యూనిచ్, జర్మనీ.
నిర్వాహకులు: Tittu Maddipatla, Venkat Kandra, Naresh Koneru
+49 17661933406, +49 17662925955, +49 1785382749
13- 25/10/2025 – Netherlands
స్టిచ్టింగ్ వసుధైవ కుటుంబకం (SVK)
స్థలం: అతలాంటా స్పోర్ట్‌సెంట్రం, డే డోమ్ 9, 5508 GE వెల్దోవెన్, నెదర్లాండ్స్.
నిర్వాహకులు: Aravind Mamidi, Amar Chand Ravi
+31 616536549
14- 26/10/2025 – Sweden
స్వీడన్ బాలాజీ దేవస్థానం
స్థలం: ఫోల్‌కెట్స్ హస్ హాల్లుండా, బోర్గ్‌వాగెన్ 1, 145 68 నార్స్‌బోర్గ్, స్వీడన్.
నిర్వాహకులు: Ramana, Praveen Vunnam
+46 76 968 1549, +46 738 020 779
15- 01/11/2025 – Germany
శ్రీ బాలాజీ వెదిక్ సెంటర్ జర్మనీ e.V
స్థలం: హౌస్ డేర్ బేగెగ్నుంగ్, బిషోఫ్-కాలర్-స్ట్రాస్ 3, 61462 కొనిగ్‌స్టైన్ ఇమ్ టౌనస్, ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ.
నిర్వాహకులు: Srikanth Kudithipudi, V. Krishna Javaji, Surya Prakash Velaga
+49 17684324751, +49 1633339901, +49 17672413890
16- 02/11/2025 – Germany
తెలుగు అసోసియేషన్ జర్మనీ e.V
స్థలం: సర్కస్-రాన్‌కల్లి-వేగ్ 11, 51063 కోలోన్, డుసెల్‌డార్ఫ్, జర్మనీ.
నిర్వాహకులు: Sumanth Korrapati, Ravi Shanker, Anand
+49 17623315833, +49 1788837283, +49 15123498089