ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటారు. ఈ రోజుల్లో పట్టణాల నుండి గ్రామాలకు కూడా ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెరుగుతోంది. కరోనా మహమ్మారి రావడంతో ప్రజల్లో ఇంకా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందని చెప్పుకోవచ్చు.దీనికి అనుగుణంగా, వారు తమ అవసరాలకు తగ్గట్టుగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు.
ప్రస్తుత సమాజంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో, ఉద్యోగానికి వెళ్లే మహిళలకు వంట చేయడానికి సమయం ఉండట్లేదు. అందుకే, తక్కువ సమయంలో, టెక్నాలజీ సహాయంతో ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటున్నారు. అందుకు ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన పరికరం ఎయిర్ ఫ్రయ్యర్.
ఎయిర్ ఫ్రయ్యర్ ద్వారా నూనె లేకుండా, కేవలం వేడి గాలులతోనే ఆహారాన్ని వండుకోవచ్చు. నూనెలో వేయించిన ఆహారంతో పోలిస్తే, ఇందులో హానికరమైన రసాయనాలు, కొవ్వులు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది అధిక క్యాలరీలను కూడా తగ్గిస్తుంది.
అయితే, ఎయిర్ ఫ్రయ్యర్ పూర్తిగా సురక్షితం కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బంగాళాదుంపలు, ఇతర పిండి పదార్థాలను అధిక వేడిలో ఎక్కువ సమయం వండినప్పుడు, వాటిలో క్యాన్సర్‌కు కారణమయ్యే యాక్రిలామైడ్ అనే రసాయనం ఏర్పడవచ్చు . ఎయిర్ ఫ్రయ్యర్ లో ఆహారం అధికంగా తీసుకుంటే క్యాన్సర్ క్యాన్సర్ బారిన పడొచ్చు సుమీ.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆకుకూరలు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉన్న మాంసాహారాలు, తక్కువ నూనెతో వండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.