తెలుగు సినిమా నుండి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరడుగుల అందగాడు. బాహుబలి సినిమాతో కేవలం ఒక నటుడిగానే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ దేశాలలో తెలుగు అవునత్వాన్ని మార్చిన రెబెల్ స్టార్‌గా ఎదిగాడు. తెలుగులో మొదలైన డార్లింగ్ ప్రయాణం ఇప్పుడు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ అగ్ర స్థానాన్ని అందుకుంది. డార్లింగ్ అద్భుతమైన యాక్షన్, స్టైల్ మరియు ప్రేక్షకులని ఆకట్టుకునే నటనతో కేవలం ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను మనసులను దోచుకున్నాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD ఒక భారీ సైన్స్ ఫిక్షన్ – మిథాలజికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి టాప్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. మహాభారతంలోని కల్కి అవతారాన్ని ఆధారంగా చేసుకుని అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, సెట్ డిజైన్‌లతో విడుదలైన వెంటనే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి, రికార్డులు సృష్టించిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..
కల్కి 2898 AD సీక్వెల్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ ఇక లేరని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని నేడు సోషల్ మీడియా X ప్లాట్‌ఫాం వైజయంత్ మూవీస్ వారు తెలియజేయడం జరిగినది.అందులో ఇలా రాశారు.
దీపికా పడుకోన్ ఇకపై కల్కి 2 లో భాగం కావడం లేదు. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ చిత్రానికి (కల్కి కి) సంపూర్ణమైన కమిట్‌మెంట్ అవసరం. కానీ అది సాధ్యం కాలేదు కాబట్టి ఇరువురి మధ్య విడిపోవడమే సరైనది. ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్స్‌కి మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అని తెలిపారు.
'కల్కి 2' సినిమా నుండి దీపికా వైదొలగడంతో ఆమె అభిమానులను కలవరపెడుతోంది. ఇది దీపికా కి కొత్తేమీ కాదు. గతంలో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా నుండి కూడా దీపికా ను రీప్లేస్ చేసిన విషయం తెలిసినదే. ఇలా వరుసగా రెండు పెద్ద సినిమాల నుండి తొలగించడంతో, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని దీపికా అభిమానులు ఆమె అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.