గర్బా ఉత్సవాల్లో అసభ్యత.. సోషల్ మీడియా వైరల్ .. మరి ఇలా ఉన్నారు ఏంట్రా అంటూ కామెంట్స్!

తెలుగు సినిమా పరిశ్రమను దశాబ్దాలుగా వేధిస్తున్న పైరసీ ముఠాల గుట్టురట్టు చేస్తూ హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరో వెలుగులోకి తెచ్చి సినీ ప్రముఖులకు షాక్ ఇచ్చారు. సినీ హీరోలు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులే పైరసీ ముఠాలకు నిధులు సమకూరుస్తున్నారని వెల్లడించారు. ఈ చేదు వాస్తవం తెలుసుకున్న వెంటనే, భవిష్యత్తులో ఏ బెట్టింగ్ యాప్‌లకూ ప్రచారం చేయకూడదని టాలీవుడ్ ప్రముఖులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

యువ నిపుణులకు గుడ్ న్యూస్.. సరికొత్త వీసా నిబంధనలు, 4 ప్రత్యేక విజిట్ వీసాలు విడుదల!

మంగళవారం నగరంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగింది. ఈ మీటింగ్‌లో అగ్రనటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నాని, నాగచైతన్యతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, పలువురు దర్శకులు, డిజిటల్ మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల పనితీరును, డబ్బు లావాదేవీలను, టెక్నికల్ లోపాలను వివరించారు. సినిమాలు రిలీజ్ కాకముందే హెచ్‌డీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో చూసి సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు.

Bank Holidays: అయ్య బాబోయ్! అక్టోబర్ నెలలో ఇన్ని సెలవలా... మొత్తం 21 రోజులు!

పోలీసుల వివరాల ప్రకారం, డిజిటల్ మీడియా సంస్థల సర్వర్లలో ఉన్న బలహీనమైన సైబర్ భద్రత వల్లే ఈ సమస్య మరింత పెరిగింది. హ్యాకర్లు సర్వర్లలోకి చొరబడి, థియేటర్లకు వెళ్లకముందే సినిమాలను దొంగిలించి పైరసీ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారని తెలిపారు. ఈ హ్యాకర్లకు నిధులు సమకూరుస్తున్నవారు బెట్టింగ్ యాప్ నిర్వాహకులేనని ఆధారాలతో చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే డిజిటల్ మీడియా సంస్థలు తమ సైబర్ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, సర్వర్ల రక్షణ కోసం అధిక నిధులు వెచ్చిస్తామని హామీ ఇచ్చాయి.

డబుల్ టెన్షన్.. రాబోయే 24 గంటల్లో.! వర్ష సూచనతో పాటు కృష్ణా వరద ఉద్ధృతి.. ఎల్లో అలర్ట్ జారీ!

ఈ సందర్భంగా పోలీసులు ఐబొమ్మ వెబ్‌సైట్‌పై కూడా దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేస్తామని సైబర్ క్రైమ్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి ఆధునాతన పరికరాలను ఉపయోగించి పైరసీ ముఠాలను పట్టుకున్నామని, ఇకపై సినీ పరిశ్రమను కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు చేస్తున్న కృషిని సినీ ప్రముఖులందరూ ప్రశంసించారు. ఈ సమావేశం తరువాత టాలీవుడ్ లో పైరసీ వ్యతిరేక ఉద్యమం మరింత వేగం అందుకోబోతోందని భావిస్తున్నారు.

Kavita new party: ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా.. కవిత కీలక వ్యాఖ్యలు!
ఆంధ్రా ఊటీకి అద్భుత రూపం.. టూరిస్టులకు కొత్త అనుభూతి! అంతర్జాతీయ స్థాయిలో - జోరుగా అభివృద్ధి పనులు!
ప్రకృతిలో అరుదైన కలివికోడి… కూతతో ఆనందపరిచిన వైఖరి!
Ration card: ఏపీ లో స్మార్ట్ రేషన్ కార్డులు! ఇలా సులభంగా స్టేటస్ చెక్ చేయండి..!
Maruti Alto K10: మారుతి ఆల్టో k10 వచ్చేస్తుందోచ్! మైండ్ బ్లోయింగ్ మైలేజ్... నెలకు రూ.3 వేలు కడితే కార్ మీ సొంతం!
TTD: తిరుమల భక్తులకు రెండు గంటల సమయం ఆదా..! శబరి ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ గా..!