తిరుమల పుణ్యక్షేత్రంలో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ పోలీసు కానిస్టేబుల్ దాడికి పాల్పడిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మంగళవారం రాత్రి తిరుమలలోని మాధవం గెస్ట్ హౌస్ సమీపంలో జరిగినట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే, అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్సు డ్రైవర్ అన్వేష్ రెడ్డి, మంగళవారం రాత్రి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే విధుల్ల ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సును నిలిపి ఉంచారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బాంబ్ స్క్వాడ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్, డ్రైవర్ అన్వేష్ రెడ్డితో వాగ్వాదానికి దిగి, అనంతరం దాడి చేశాడు. ఈ దాడి దృశ్యాలు బస్సులో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఇది కూడా చదవండి: వైకాపా నేతల అత్యుత్సాహం.. పోలీసుల ఆగ్రహం వ్యక్తం! మంగళగిరిలో ఉద్రిక్తత..
ఈ ఘటనపై ఆర్టీసీ డ్రైవర్లు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న తమ సిబ్బందిపై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధితుడైన డ్రైవర్ అన్వేష్ రెడ్డి, ఇతర డ్రైవర్లు మరియు ఆర్టీసీ యూనియన్ నాయకులతో కలిసి వెంటనే ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం, వారు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధ్యుడైన బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందజేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం! ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్?
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!
పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!
కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!
కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: