రహదారులు భవనాల శాఖ పై సమీక్షలో సీఎం చంద్రబాబు.. సమర్థవంతంగా రోడ్ల నిర్వహాణ! ఏపీ-లింక్ ను ఆర్థికంగా..

2025-11-26 20:11:00
Andhra Pradesh: ఉండవల్లిలో రామ్ లాల్–లోకేష్ భేటీ… ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంలో కీలక చర్చలు!!

ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ – ఏపీ లింక్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలోని రహదారులను గుంతలు లేకుండా తీర్చిదిద్దడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని సీఎం స్పష్టం చేశారు. 

Google Meet: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మీటింగ్‌లకు భారీ షాక్! గూగుల్ మీట్‌లో భారీ సాంకేతిక లోపం..!

బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...”ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ-లింక్ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇప్పటి నుంచే దీనిపై ప్రణాళికలు రూపోందించాలి. లాజిస్టిక్స్ కార్పోరేషన్ ను 
బలోపేతం చేసే క్రమంలో రహదారులు భవనాల శాఖకు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాలను ఎంత వరకు వినియోగించుకోవచ్చో చూడాలి. 

PM Modi: 18 ఏళ్ల యువతకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయి!

లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే సంస్థ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. అప్పుడు రాష్ట్రంలోని రహదారుల నెట్ వర్క్ తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు.”అని సీఎం చెప్పారు.

Islamic Emirate: ఇస్లామిక్ ఎమిరేట్ ఘాటు హెచ్చరిక.. సమయం వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తాం!

రోడ్ల నిర్మాణంలో నాణ్యత... ఇంజనీర్లకు జవాబుదారీతనం..
“రోడ్ల నిర్మాణం, నిర్వహణ, పాత్స్ హోల్స్ ఫ్రీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లనేవి రాష్ట్రంలో కన్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్ల నిర్మాణంలో, నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా చూసుకోవాలి. 

Scooters: దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు!

అలాగే కాంట్రాక్టర్లు ఏదైనా తప్పు చేసినా... నాణ్యతలో రాజీ పడినా అలాంటి కాంట్రాక్టర్లను  గుర్తించాలి. ఇక ఇంజనీర్లు కూడా జవాబుదారీతనంతో పని చేయాలి. ఈ ఏడాది మార్చిలో ఆమోదించిన రోడ్ల నిర్వహణ, పాత్ హోల్స్ పనులు 10 నుంచి 15 శాతం మేర పనులు పూర్తయ్యాయి. 

Tech News: వాట్సాప్‌లో నుంచి కోపైలట్‌కు గుడ్‌బై… జనవరి 15తో మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం!!

అలాగే ఇటీవలే ఆమోదించిన పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోండి. ఇప్పటి వరకు ఆమోదాలు పొందిన పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తయ్యేలా చూడాలి. అలాగే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలి. 

Shivaji tweet: బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు.. శివాజీ!

దీని కోసం డ్రోన్లు, లైడార్ సర్వే  అవసరమైతే శాటిలైట్ సర్వేల ద్వారా  రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న అంశాలను పరిశీలించటంతో పాటు పనులు ఏ విధంగా జరుగుతున్నాయోననే విషయాన్ని గుర్తించాలి. దీని కోసం టెక్నాలజీని వినియోగించుకోవాలి.  

Vikarabad Politics: వికారాబాద్‌ రాజకీయాల్లో సంచలనం...! సర్పంచ్–వార్డులన్నీ ఒకే కుటుంబానికి..!

మొంథా తుఫానులో నష్టపోయిన రోడ్లు, బ్రిడ్జిల పునర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఇప్పటికే కొన్నింటిని చక్కదిద్దాం... పెండింగులో ఉన్న పనులను కూడా వెంటనే చేపట్టాలి. పీపీపీ విధానంలో చేపట్టనున్న రోడ్ల జాబితా వెంటనే సిద్దం చేయాలి. 

Babasaheb Ambedkar: 125 కోట్ల ప్రజలకు రక్షణ కవచం.. రాజ్యాంగం!

నిబంధనల ప్రకారం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఏయే రోడ్లకు ఇవ్వగలమనేది పరిశీలించాలి. వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణంపై పైలెట్ ప్రాజెక్టులు చేపట్టాలి.”అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Thanksgiving USA: అమెరికాలో థాంక్స్‌గివింగ్ వీక్‌ సందడి… కుటుంబాల్ని ఒక్కటిచేసే శతాబ్దాల పండుగ కథ!

నేషనల్ హైవేల పనుల్లో జాప్యం జరగకూడదు..
“రాష్ట్ర రోడ్లతో పాటు... నేషనల్ హైవేల విషయంలోనూ అధికారులు దృష్టి పెట్టాలి. నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. భూసేకరణ మొదలుకుని ఇతర అంశాల్లో కేంద్రానికి పూర్తిగా సహకరించాలి. 

యూత్ కల... గూడెం కష్టం - ఓటీటీలోకి 'దండకారణ్యం'.. అడవి నేపథ్యం, ఆదివాసీల పోరాట గాథ చూడాల్సిందే!

ఏ మాత్రం జాప్యం జరగడానికి వీల్లేదు. అలాగే స్టేట్ ఫస్ట్... డెవలప్మెంట్ ఫస్ట్ అనే విషయాన్ని ప్రజాప్రతినిధులు అంతా గుర్తించాలి.”అని సీఎం వివరించారు. ఈ సమీక్షకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బి, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Vijayawada: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్..! ఆ ప్రాంతాల్లో రైల్వే స్లైడింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Typhoon Senyar: ఇండోనేషియాలో సెన్యార్ తుఫాన్ బీభత్సం.... 8 మంది మృతి.. రాత్రికి తుఫాన్ తీరం దాటే అవకాశం!
వంట గ్యాస్ ఆదా రహస్యం.. సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి!

Spotlight

Read More →