SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు!

Palla Srinivasa Rao Speech: ప్రతి తెలుగు బిడ్డకు అండగా ఉంటాం.. రంగంలోకి ఎన్ఆర్ఐ టీడీపీ సెల్! గల్ఫ్ సంక్షోభంపై కీలక ప్రకటన!

Palla Srinivasa Rao Speech: అమరావతి మార్చి 02: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అక్కడ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Published : 2026-03-02 22:00:00
  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూమ్: సహాయం కోసం 95500 57623 నంబర్‌కు పిలుపు..
     
  • గల్ఫ్ బాధితులకు వసతి, ఆహారం: అండగా నిలుస్తున్న ఎన్నారై టీడీపీ సోదరులు..

Palla Srinivasa Rao Speech: అమరావతి మార్చి 02: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అక్కడ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వానికి తెలుగు దేశం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

గత నాలుగు రోజులుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎన్ఆర్ఐ టిడిపి సెల్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ, గల్ఫ్ దేశాల కోఆర్డినేటర్లతో ప్రతిరోజూ టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తోందన్నారు. అత్యవసర సహాయం అవసరమైన ప్రాంతాల్లో వెంటనే స్పందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అక్కడి ఎన్ఆర్ఐ టీడీపీ సోదరులు సమయానుకూలంగా సహకారం అందిస్తున్నారని, అవసరమైన చోట తాత్కాలిక వసతి, ఆహారం, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీఎస్) ద్వారా ప్రభుత్వ సహాయాన్ని కూడా ప్రభావితులకు అందిస్తున్నామని పల్లా వెల్లడించారు. ప్రమాదావకాశం ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు స్థానికంగా ఆయా దేశాలలో ఉన్న ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ లు సమన్వయం చేస్తున్నారని వివరించారు.

ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నామని తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో అవసరమైన సమన్వయం జరిపి, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా, ప్రభావితులందరికీ తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు ఇస్తున్నారని పల్లా పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం లో కూడా 24/7 హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. సహాయం అవసరమైన వారు హెల్ప్‌లైన్ / వాట్సాప్ నెంబర్ 95500 57623, 79978 26882 ను సంప్రదించి తమ వివరాలు పంపవచ్చని, అలాగే nricell@telugudesam.org కు మెయిల్ ద్వారా సమాచారం అందించవచ్చని సూచించారు.

విదేశాల్లో ఎక్కడ ఉన్నా ప్రతి తెలుగు వానికి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పల్లా శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. సంక్షోభ సమయాల్లో స్పందించే నాయకత్వం రాష్ట్రానికి ఉన్నదన్న విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నామని తెలిపారు.

Spotlight

Read More →