Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్!

Vijayawada: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్..! ఆ ప్రాంతాల్లో రైల్వే స్లైడింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

 రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని పెంచి, పారిశ్రామిక–రవాణా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఏపీ కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. కేంద్రంత

Published : 2025-11-26 12:35:00
యూత్ కల... గూడెం కష్టం - ఓటీటీలోకి 'దండకారణ్యం'.. అడవి నేపథ్యం, ఆదివాసీల పోరాట గాథ చూడాల్సిందే!

రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని పెంచి, పారిశ్రామిక–రవాణా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఏపీ కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. కేంద్రంతో అనుసంధానం పెంచుతూ, కొత్త రైలు మార్గాలు, అదనపు రైలు సౌకర్యాలు, స్లైడింగ్‌ల ఏర్పాటు వంటి కీలక ప్రతిపాదనలు పంపుతోంది. ఈ క్రమంలోనే ఓర్వకల్లు, శ్రీ సిటీ ప్రాంతాల్లో రైల్వే స్లైడింగ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఈ ప్రతిపాదనల ప్రాముఖ్యతను వివరించగా, కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఆయన చెప్పారు. ఇది పారిశ్రామిక ప్రాంతాల్లో సరకు రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి.

Women welfare: ఏపీలో గర్భిణులకు సర్కార్ గోల్డెన్ సపోర్ట్! అంగన్‌వాడీల ద్వారా డోర్-టు-డోర్ సాయం!

ఈ సమావేశంలో మరో కీలక అంశంగా కర్నూలు–విజయవాడ మధ్య కొత్త రైలు సర్వీస్ అవసరాన్ని మంత్రి భరత్ ప్రస్తావించారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాల రోజువారీ ప్రయాణం కోసం ఈ రైలు అత్యంత అవసరమని, కర్నూలు ప్రజలు దీని కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. రైల్వే స్లైడింగ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు, ముడి సరుకు రవాణా వేగవంతమవడంతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే అవకాశమూ ఉందని టీజీ భరత్ పేర్కొన్నారు. రైల్వే స్లైడింగ్ అనేది మెయిన్ లైన్‌కు పక్కన ఉండే చిన్న రైలు మార్గం. పెద్ద పరిశ్రమలు, గనులు, పవర్ ప్లాంట్లు తమ సరుకు తేలికగా రవాణా చేసేందుకు ఇవి కీలకంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా వాడకం లేని రేకులు, వ్యాగన్లు నిలిపేందుకు, రైల్వే షంటింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి ఇవి వినియోగిస్తారు.

TTD: 2012లో రూ.16 కోట్లు.. ఇప్పుడు మళ్లీ శ్రీవారికి రూ.9 కోట్ల సేవ.. ఉదయ్‌పూర్‌లో కూతురు పెళ్లి తర్వాత!

పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఓర్వకల్లు మరియు శ్రీసిటీలో ఈ స్లైడింగ్‌ల ఏర్పాటు అత్యంత అవసరమని మంత్రి భరత్ చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు, ఎగుమతి యూనిట్లు, తయారీ కేంద్రాలు ఉండటంతో రైల్వే కనెక్టివిటీ మెరుగుపడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ఇవే కాకుండా, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం, నిధులు అందించాలని కూడా మంత్రి కోరారు. రాబోయే సంవత్సరాల్లో ఏపీని రైల్వే హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

TS SSC Schedule: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి… కొత్త షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!!

ఇదిలా ఉండగా, విజయవాడ రైల్వే స్టేషన్ భారీ మార్పులకు సిద్ధమవుతోంది. స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్‌ను అత్యాధునిక హంగులతో పునర్నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పీపీపీ మోడ్‌లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో ప్రయాణికుల సౌకర్యాలు, వసతులు ఎన్నో రెట్లు మెరుగయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను 12కు పెంచాలని తొలి ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ, చివరకు రైల్వే అధికారులు అదనపు ప్లాట్‌ఫామ్‌ల ఆలోచనను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి రూపొందిన సమగ్ర రైల్ కనెక్టివిటీ ప్రణాళిక కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయినప్పటికీ, ఆధునీకరణ పనులు పూర్తయితే విజయవాడ స్టేషన్ దేశంలో అత్యాధునిక రైల్వే టెర్మినల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

బిగ్‌బాస్ 9 క్లైమాక్స్.. ఇమ్మాన్యుయేల్ టైటిల్ ఆశలపై నీళ్లు? ఆ తప్పు కొంప ముంచిందా? ఫినాలేకు 3 వారాలే..!
Godavari Pushkaralu: చంద్రన్న ప్రభుత్వంలో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు!!
ఇండిగో సంచలన నిర్ణయం - తక్కువ ధరకే విమానం ఎక్కే ఛాన్స్! సంక్రాంతి, వేసవి సెలవులకు ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి!
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. కోళ్ల షెడ్డుపై దాడికి యత్నం.. సీసీటీవీలో రికార్డు!
T20 World Cup: T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. కొలంబో వేదికగా IND vs PAK!
Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం…! సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం..!

Spotlight

Read More →