AP Development: గుంటూరు అభివృద్ధికి రూ.400 కోట్ల నిధులు! 2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి! AP Government: APNRT, RTGS అధికారులతో సీఎం అత్యవసర భేటీ... యుద్ధ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారికి ప్రత్యేక హెల్ప్‌లైన్! New Railwayline: ఇక గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు... మక్కాజిపల్లి-ధర్మవరం కొత్త లైన్ సిద్ధం Iran-Israel: నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ దాడి... ఇజ్రాయెల్ ప్రధాని పరిస్థితి అగమ్యగోచరం! AP Government: రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ! సునీల్ నాయక్ కేసులో ఉత్కంఠ... Ration card: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్! కేజీ రూ.20 మాత్రమే.. ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! PM Modi: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ప్రధాని మోదీ అర్థరాత్రి వరకు భద్రతా సమీక్ష! Gulf Residents: గల్ఫ్ ప్రవాసాంధ్రులు ఆందోళన చెందొద్దు... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా! హెల్ప్‌లైన్ నంబర్లు... Amaravathi Works: అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం..!! Chandrababu: వారికి చంద్రబాబు బంపర్ ఆఫర్! రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు! AP Development: గుంటూరు అభివృద్ధికి రూ.400 కోట్ల నిధులు! 2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి! AP Government: APNRT, RTGS అధికారులతో సీఎం అత్యవసర భేటీ... యుద్ధ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారికి ప్రత్యేక హెల్ప్‌లైన్! New Railwayline: ఇక గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు... మక్కాజిపల్లి-ధర్మవరం కొత్త లైన్ సిద్ధం Iran-Israel: నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ దాడి... ఇజ్రాయెల్ ప్రధాని పరిస్థితి అగమ్యగోచరం! AP Government: రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ! సునీల్ నాయక్ కేసులో ఉత్కంఠ... Ration card: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్! కేజీ రూ.20 మాత్రమే.. ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! PM Modi: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ప్రధాని మోదీ అర్థరాత్రి వరకు భద్రతా సమీక్ష! Gulf Residents: గల్ఫ్ ప్రవాసాంధ్రులు ఆందోళన చెందొద్దు... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా! హెల్ప్‌లైన్ నంబర్లు... Amaravathi Works: అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం..!! Chandrababu: వారికి చంద్రబాబు బంపర్ ఆఫర్! రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు!

Savita Fire On YCP: ఆనాడే ఇదే విషయమై వైసీపీ శ్రేణులు నిలదీయాల్సింది.. మంత్రి సవిత ఫైర్!

Savita Fire On YCP: ‘కమిషన్ల పేరుతో దోచుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జగన్ తెర తీశాడు... ఎన్జీటీ అడ్డుకోవడంతో ఆ కుట్ర విఫలమైంది... 2020 అక్టోబర్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపేయాలంటూ ఎన్జీటీ స్టే ఇస్తే, ఆ తరవాత మూడేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదు...

Published : 2026-03-02 20:00:00
  • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోవడానికి ప్రధాన కారణం జగనే..
     
  • అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు రమ్మంటున్నాజగన్ బ్యాచ్ రావడం లేదు..

Savita Fire On YCP: ‘కమిషన్ల పేరుతో దోచుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జగన్ తెర తీశాడు... ఎన్జీటీ అడ్డుకోవడంతో ఆ కుట్ర విఫలమైంది... 2020 అక్టోబర్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపేయాలంటూ ఎన్జీటీ స్టే ఇస్తే, ఆ తరవాత మూడేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదు.... ఇదే విషయమై ఆనాడే జగన్  ను వైసీపీ శ్రేణులు నిలదీసి ఉంటే... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయ్యి ఉండేది..’ అని  రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు  జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్  నిలిచిపోవడానికి ముమ్మాటికీ జగనే కారణమని,  రౌండ్ టేబుళ్ల సమావేశాలంటూ ఇప్పుడు వైసీపీ శ్రేణులు చేస్తున్నదంతా డ్రామాలేనని విమర్శించారు.

రాయలసీమను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండేలా సీఎంచంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. వారి రౌండ్ టేబుళ్ల సమావేశాల డ్రామాలు ప్రజలు గుర్తించారని, వైసీపీ కుట్రలను  పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అన్నారు. కమిషన్ల కక్కుర్తి కోసం ఎటువంటి అనుమతులు లేకున్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తన హయాంలో జగన్ ప్రారంభానికి సిద్దమయ్యారన్నారు. 

తెలంగాణాలో అధికారంలో ఉన్న ఆనాటి బీఆర్ఎస్ నాయకులు ఎన్జీటీకి వెళ్లడంతో, ఎత్తిపోతల పథకానికి కోర్టు అడ్డు చెబుతూ, ప్రాజెక్టు పనులు నిలిపేయాలని 2020న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎక్కడవక్కడ నిలిచిపోయాయన్నారు. కోర్టు ఉత్తర్వుల తరవాత జగన్... రాష్ట్రంలో మరో మూడేళ్లు అధికారంలో ఉన్నారన్నారు. కనీసం ఆయన  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మంత్రి సవిత విమర్శించారు.

ఆనాడే జగన్ ను నిలదీసి ఉండాల్సింది…
జగన్ అవినీతి, అసమర్థ నిర్ణయాల వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇదే విషయమై ఆనాడే జగన్ ను రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నిలదీయాల్సి ఉండాల్సిందన్నారు. జగన్ తీరుతో రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు పట్టించుకోవడం మానేసి, ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. వైసీపీ నాయకుల చేష్టలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి సవిత తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం రాయలసీమకు తాగు, సాగునీరందించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. వైసీపీ నాయకుల పొలాలకు నీరు వస్తుందంటే అది కూడా సీఎం చంద్రబాబు చలవేనని మంత్రి సవిత స్పష్టంచేశారు.

సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి…
రాయలసీమను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 2014-19 మధ్య రాయలసీమ తాగు, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12,441 కోట్లు వెచ్చించారని మంత్రి సవిత గుర్తు చేశారు. తరవాత వచ్చిన జగన్ ... అయిదేళ్లలో కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రాయలసీమ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రూ.3,870 కోట్లతో హంద్రీ-నీవా కాలువను అభివృద్ధి కుప్పం వరకూ సాగు నీరందించామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్, పారిశ్రామిక, పర్యాటక హబ్ గా అభివృద్ది చేస్తున్నామన్నారు. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధిక శాతం ఏపీకే తరలొస్తున్నాయన్నారు. ఇందుకు కారణం సీఎం చంద్రబాబు విజనేనని మంత్రి సవిత కొనియాడారు.

చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ
ప్రజా సమస్యలపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా జగన్ గాని, ఆయన పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని మంత్రి సవిత మండిపడ్డారు. వైసీపీ అయిదేళ్ల కాలంలో జరగని అభివృద్ధి కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అసెంబ్లీకి రావాలని, పద్ధతిగా మీకు రావాల్సిన సమయం కేటాయిస్తామని చెప్పినా వైసీపీ నేతలు శాసనసభకు రావటంలేదన్నారు. శాసనమండలికి వస్తున్నా సభ జరగనీయకుండా, క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా, భయపడి సభ నుంచి పారిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి మండిపడ్డారు. 2026-27 నూతన బడ్జెట్ లో బీసీలకు అధిక ప్రాధాన్యం కలిగించేలా కేటాయింపులు చేశారన్నారు. తమది బీసీల పక్షపాతి ప్రభుత్వమని మంత్రి సవిత స్పష్టం చేశారు. 

Spotlight

Read More →