నేడు(25/09) టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు మరియు వారితో పాటు గ్రీవియన్స్ లోని ఆనందబాబు ప్రజావినతులను స్వీకరించారు. ప్రజావేదిక పరిష్కారాల పూర్తి వివరాలు..
వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురం గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..తమ గ్రామంలోని సర్వే నెం. 187లో 11 ఎకరాల భూమి ఉంది.
అయితే అదే గ్రామానికి చెందిన కొయ్యగూర రమేష్ రెడ్డి అక్రమ పద్ధతిలో కొంత భూమిని తన పేరుమీద వ్రాయించుకుని తమ భూమిలో కూడా తనకూ వాటా వస్తుంది అంటూ పదే పదే గొడవలు పడుతుండేవాడు. 2019 జనవరి 31న రమేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి తన తండ్రిపై దాడి చేయించగా, ఆ దాడిలో తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆ సమయంలో కూడా ఇంకోసారి అడ్డం వస్తే ప్రాణాలు తీస్తాం అని బెదిరించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వ కాలంలో రమేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి అక్రమ ఇసుక రవాణా చేయడమే కాకుండా, గండికోట ప్రాజెక్ట్ పునరావాసంలో 270 మంది బోగస్ పేర్లు చేర్చారని తన తండ్రి అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై కక్ష పెంచుకున్న రమేష్ రెడ్డి, అతని అనుచరులు 2020 నవంబర్ 13న తన తండ్రిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని ఏపీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబుకి అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
విజయనగరం జిల్లా గుర్ల మండలం దేవునిపాక గ్రామానికి చెందిన సభుకు లక్ష్మణ్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నెం.3 లో 10 ఎకరాల డి-పట్టా భూమిని గత సుమారు 30 సంవత్సరాలుగా సాగుచేస్తు జీవనం సాగిస్తున్నాను. సదరు భూమిలో తహసీల్దార్ సర్వే చేయించి ఆ 10 ఎకరాల భూమిలో తనకు 4 ఎకరాల హక్కు వచ్చేలా పట్టా మంజూరు చేస్తామన్నారు.
కానీ సదరు భూమిని తమ ఊరి వైసీపీ సర్పంచ్ పూనపెంట చంటిరాజు, వైసీపీ కార్యకర్తలు ములగపు రవన్న, మంచెల రాము అనువార్లు కలిసి ఆక్రమించి పట్టా రానివ్వకుండా వేరే వ్యక్తులకు రూ.30లక్షలకు అమ్ముకొని తమని సాగు చేయనియకుండా అడ్డుపడుతున్నారు.
దీనిపై ప్రశ్నిస్తే తమ కుటుంబంలో 50 ఓట్లు ఉన్నాయి. మీరు వైసీపీకి ఓటు వేయలేదు భూమిపై మీకు ఎలాంటి హక్కులేదని బెదిరిస్తున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
కర్నూలు జిల్లా కొడుమూరు మండలం కల్లపారి గ్రామానికి చెందిన కరుణాకర్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం.654లో 68 సెంట్లు భూమి కలదు. గత ప్రభుత్వంలో చేపట్టిన రీ సర్వేలో తమ భూమిని ప్రభుత్వ భూమిగా నమోదు చేయడం జరిగింది.
దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావునా అధికారులతో మరల సర్వే చేయించి తమ భూమిని ప్రభుత్వ జాబితా నుంచి తొలగించి తమ పేరుపై వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.
కర్నూలు జిల్లా కొడుమూరు మండలం వర్కురు గ్రామానికి చెందిన శంకరమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గోనెగండ్ల మండలం తిప్పనూరు గ్రామ పరిధిలో సర్వే నెం.55/1లో 3 ఎకరాల భూమి కలదు. ఈ భూమి తమపేరుపై 1.50 సెంట్లు, ఉరుకుందమ్మ పేరుపై 1.50 సెంట్లు కొనుగోలు చేశాం.
గత ప్రభుత్వంలో రీసర్వే పొరపాట్ల కారణంగా తమ పేరుపై 0.67 సెంట్లు, ఉరుకుందమ్మ పేరుపై 1.20 సెంట్లు ఆన్ లైన్ లో నమోదు చేశారు. కావునా తమయందు దయవుంచి తమ భూమి మొత్తాన్ని తమపేరుపై ఆన్ లైన్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు.