ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌పై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వారం వ్యవధిలోనే రెండుసార్లు తలపడ్డ చిరకాల ప్రత్యర్థుల సమరంలో, రెండోసారి కూడా భారత్ పైచేయి సాధించింది. ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది.
ఇదిలా ఉంటే, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇండియాకు ఓడి తీవ్ర అవమానం పాలైన పాకిస్తాన్ పరువు మరింత తీసేశాడు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా–పాక్ పోటి గురించి జర్నలిస్టులు ప్రశ్నించగా, అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.
ఇండియా–పాకిస్తాన్ మధ్య ఎటువంటి పోటీ లేదు. ఇక దాని గురించి ప్రశ్నలు అడగడం ఆపేయండి అని స్పష్టం చేశాడు. ఎందుకు అలా అన్నాడో కూడా క్లారిటీ ఇచ్చాడు. రెండు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు జరిగితే, ఇరు జట్లు చెరో 7–8 మ్యాచ్‌లు గెలిస్తే పోటీ ఉన్నట్టే. కానీ ఒకే జట్టు 12–13 మ్యాచ్‌లు గెలిస్తే దాన్ని పోటీగా ఎలా పరిగణిస్తారు? అని సూటిగా అన్నాడు. కచ్చితంగా ఇక్కడ పోటీ లేదు. ఇకపై పాకిస్తాన్‌తో మాకు పోటీ అనొద్దు, ఎందుకంటే మేము వారి కంటే మెరుగైన స్థితిలో ఉన్నాం అని బమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు సూర్య.
వరుస ఓటములతో ఇప్పటికే బాధలో ఉన్న పాకిస్తాన్‌కు, కెప్టెన్ సూర్య మాటలు పుండు మీద కారం చల్లినట్లయ్యాయి. అంతేకాక, ఆదివారం మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు హద్దు మీరి ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీనితో సూర్య ఇచ్చిన సమాధానం వారికి కరెక్ట్ కౌంటర్‌గా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.