ఇది కూడా చదవండి: Rajya Sabha: ఏపీ నుంచి రాజ్యసభకు మాజీ ప్రధాని! కూటమి కోటాలో ఆ ముగ్గురు!


వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు, పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిశోర్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. పార్టీ మారడం లేదన్న కారణంతో టీడీపీ నేత దారపనేని శ్రీనివాసరావుపై 2022 అక్టోబర్ 7న తురకా కిశోర్, బోదిలవీడుకు చెందిన మేదరమెట్ల శ్రీను, పంగులూరి బాబు మరికొందరు దాడి చేసి హత్యాయత్నంకు పాల్పడ్డారు. అయితే దీనిపై నాడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. తాజాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ దారపనేని శ్రీనివాసరావు ఆదివారం మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తురకా కిశోర్‌తో పాటు ఇతర నిందితులపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: New National Highway: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే! రూ.1,040 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈరూట్‌లోనే!


నిందితుల్లో మేదరమెట్ల శ్రీను, పంగులూరి బాబులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సమందర్ వలీ తెలిపారు. కాగా, ఇప్పటికే తురకా కిశోర్‌పై ఏడు హత్యాయత్నం కేసులు, మరో ఏడు ఇతర కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన తురకా కిశోర్, బెంగళూరులోని తన సోదరుడు వద్ద ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వచ్చిన సందర్భంలో ఏపీ పోలీసులు అరెస్టు చేసి గుంటూరు జైలుకు తరలించారు. మరోవైపు నెల రోజుల క్రితమే ఆయనను మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Amaravati Work Updates: గెయిల్, అంబికా సంస్థలకు భూకేటాయింపులు రద్దు.. ప్రభుత్వం ఉత్తర్వులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Highway Developement: హైవేల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.₹40,000 కోట్లతో... మారనున్న రూపు రేఖలు!

IIIT Counseling: APలో నాలుగు IIITలకు రెండో విడత కౌన్సెలింగ్... జూలై 17న!

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!

Plane Crash: ఘోర విమాన ప్రమాదం! టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి మంటల్లో...

AP Government: ఏపీలో స్పేస్ పాలసీ ప్రకటన.. అమల్లో ఐదేళ్లు ఉండేలా మార్గదర్శకాలు!

Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఫీజు బకాయిలకు చెక్ పెట్టిన ఏపీ ప్రభుత్వం!

Chandrababu Tour: ఢిల్లీలో చంద్రబాబు రెండ్రోజుల పర్యటన! కేంద్రమంత్రులతో భేటీలు..

AP Lands Registration: బ్యాడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు!

BITS Pilani: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ! అమరావతిలో రూ.1000 కోట్లు పెట్టుబడి!

Praja Vedika: నేడు (14/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group