ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌‌గా... టైమింగ్స్ మారాయి!

ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) ప్రభుత్వం మరోసారి ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల (Freehold land registrations) నిలుపుదల గడువును పొడిగించింది. ఈ మేరకు ఈ భూముల రిజిస్ట్రేషన్‌లను మరో రెండు నెలలు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు స్పెషల్ సీఎస్ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిషిద్ధ జాబితా నుంచి ఎసైన్డ్ భూములను తొలగించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ అంశంపై ప్రభుత్వం విచారణ చేస్తోంది.. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం అక్టోబరులో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. అందుకే రిజిస్ట్రేషన్ల నిలుపుదల గడువును పొడిగించారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 5 లక్షల ఎకరాల ఎసైన్డ్ భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు.

ఇది కూడా చదవండి: MGM Hospital: ఎంజీఎం ఆసుపత్రిలో మారిన మృతదేహం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు!

అయితే నిబంధనల ప్రకారం 20 ఏళ్లు దాటిన భూములను మాత్రమే తొలగించాల్సి ఉంటంది. కానీ గత ప్రభుత్వం ఆ నిబంధనలను ఉల్లంఘించగా.. దాదాపు 25 వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపై ప్రభుత్వం విచారణ చేస్తుండగా.. భూ సమస్యల పరిష్కారానికి కేబినెట్ (Cabinet) సబ్ కమిటీన కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అక్టోబర్ నాటికి ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంపై ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత ఈ భూముల అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగితే వాటిని రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన బిల్లు అమల్లోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: BR Naidu TTD: అమెరికాలోని బర్మింగ్ హామ్ లో వరల్డ్ పోలీస్ గేమ్స్-2025! అభినందించిన బీఆర్ నాయుడు!

ఫోర్జరీ డాక్యుమెంట్ల (Forged Documents) తో జరిగే అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, బ్రాండెడ్ కంపెనీలతో వ్యాపారం చేసే ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సివిల్ కోర్టులకు మాత్రమే అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం ఉంది. 2023 మార్చి 20న అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908ను సవరించగా.. (AP యాక్ట్ అమెండ్‌మెంట్-2023) బిల్లును శాసనసభ ఆమోదించింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Pooja Hegde: పూజా హెగ్దే హాట్ అండ్ హైప్.... "కూలీ" సాంగ్‌తో రీ ఎంట్రీ పవర్‌!

'ఒకవేళ ఏవైనా రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగాయని ఫిర్యాదులు వస్తే.. జిల్లా రిజిస్ట్రార్ వాటిని పరిశీలిస్తారు.. ఆధారాలు ఉంటే కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి సిఫార్సు చేస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, ఇతర అధికారులు ఉంటారు. నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ చేసినా, ఒకే ఆస్తికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేసినా, కోర్టు అటాచ్‌మెంట్‌లో ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేసినా సబ్-రిజిస్ట్రార్లకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ సబ్-రిజిస్ట్రార్ (Sub-Registrar) వల్ల కొనుగోలుదారులకు నష్టం వాటిల్లితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది' అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Amaravati Express Highway: అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Ahmedabad flight: విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి!

Liquor Scam Case: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి! 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్!

Chandrababu Gift: చంద్రబాబు ఆదేశాలతో ఆ నలుగురు చిన్నారులకు సైకిళ్లు అందజేత! రూ.52 వేలు బ్యాంకు ఖాతాలో..

Employment News: ఆ ఉద్యోగస్తులకు ప్రభుత్వం శుభవార్త! కేబినెట్ సబ్ కమిటీ పలు మార్లు!

Godavari River: గంట గంటకు పెరుగుతున్న గోదావరి... లోతట్టు ప్రాంతాల ప్రజలుకు హెచ్చరిక!

Visa: అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్... అదనపు ఫీ ఎంత అంటే!

Substations: ఆ జిల్లాకు మూడు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు! ఎస్‌ఈ శ్రవణ్ కుమార్ ప్రకటన!

Job offers: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు గ్లోబల్ అవకాశాలు! శిక్షణతో పాటు ఉద్యోగం!

RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!

 Hero Prabhas: ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్! కారణం తెలిస్తే అవాక్కవుతారు!

Donald Trump: ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్..! భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్!

Ration Card Holders: వారెవ్వా.. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారికి భారీ గుడ్ న్యూస్! రేషన్ కార్డు ఉంటే చాలు!

Dwacra Womens: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్..! రూ.30వేలు, రూ.12వేలు చొప్పున డిస్కౌంట్, త్వరపడండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group