రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతీ ఏడాది బ్యాంకు సెలవుల జాబితాను నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం విడుదల చేస్తుంది. ఈ చట్టం ప్రకారం చెక్కులు, ప్రామిసరీ నోట్లు వంటి ఆర్థిక పత్రాల ప్రాసెసింగ్ కూడా సెలవు రోజుల్లో జరగదు. కాబట్టి ఆగస్టులో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ముందుగానే సెలవుల వివరాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇది మీ సమయం, డబ్బును ఆదా చేయడమే కాకుండా, అనవసర ప్రయాణాలను కూడా నివారించవచ్చు.
ఆగస్టు 2025 బ్యాంకు సెలవుల ముఖ్యమైన తేదీలు:
ఆగస్టు 8 (శుక్రవారం):
రక్షాబంధన్ (రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్)
టెండోంగ్ లో రమ్ ఫట్ (గ్యాంగ్‌టక్, సిక్కిం)
ఆగస్టు 9 (శనివారం):
రెండవ శనివారం సాధారణ సెలవు.
అనేక రాష్ట్రాల్లో రక్షాబంధన్, ఝులన్ పూర్ణిమ వేడుకలు ఉండొచ్చు.
ఆగస్టు 10 (ఆదివారం):
దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 13 (బుధవారం):
పేట్రియట్ డే (ఇంఫాల్, మణిపూర్)
ఆగస్టు 15 (శుక్రవారం):
స్వాతంత్ర్య దినోత్సవం – దేశవ్యాప్తంగా సెలవు
షహెన్షాహీ పర్సీ నూతన సంవత్సరం
జన్మాష్టమి వేడుకలు
ఆగస్టు 16 (శనివారం):
జన్మాష్టమి సందర్భంగా పలు నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి (విజయవాడ, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, భోపాల్, తదితర నగరాలు)
ఆగస్టు 19 (మంగళవారం):
అగర్తలాలో మహారాజా బీర్ బిక్రమ్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి
ఆగస్టు 25 (సోమవారం):
శ్రీమంత శంకరదేవుని తిరుభవ దినం – గౌహతి (అస్సాం)లో బ్యాంకులు మూసివేయబడతాయి

ఆగస్టు 27 (బుధవారం):
గణేష్ చతుర్థి – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి
ఆగస్టు 28 (గురువారం):
నువాఖై పండుగ – ఒడిశా, గోవా లో బ్యాంకులు మూసివేయబడతాయి
ఆగస్టు 31 (ఆదివారం):
దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
గమనిక: తీజ్, హర్తాలికా, ఓనం వంటి ప్రాంతీయ పండుగల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో అదనపు సెలవులు ఉండవచ్చు.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు:
బ్యాంకుల ఫిజికల్ బ్రాంచులు మూసివేయబడ్డా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్‌లు, ఏటీఎంలు లాంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే, ఆన్‌లైన్ మోసాల నుండి రక్షణకు మీరు అప్రమత్తంగా ఉండడం ఎంతో కీలకం.