LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Education

AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!!

AP Investments 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు (SIPB) 16వ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు రూ. 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు, రాష్ట్రంలో 1,11,278 కొత్త ఉద్యోగాల సృష్టికి బాటలు వేశారు..

AndhraPravasi News Desk 2 min read
AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!!

AP Investments 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు  సమావేశం భారీ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో సుమారురూ. 39,436.84 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు  బోర్డు పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఏకంగా 1,11,278 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 

ముఖ్యంగా ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఈ కొత్త కొలువులు రాబోతున్నాయి.రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను వాడుకుని ఆదాయం పెంచుకోవడంతో పాటు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మొత్తం 31 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో అత్యధికంగా విద్యుత్ రంగంలో 8 ప్రాజెక్టులు, ఐటీ రంగంలో 11 ప్రాజెక్టులు ఉన్నాయి. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి ప్రధాన నగరాలతో పాటు వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు కూడా ఈ పెట్టుబడుల వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.పరిశ్రమల స్థాపనలో భద్రతా ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

సౌర విద్యుత్  ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 325 గిగావాట్ల సోలార్ విద్యుత్ తయారు చేసే సత్తా ఉందని అధికారులు వివరించారు. ఈ అవకాశాన్ని వాడుకుంటే భవిష్యత్తులో మనం ఇతర రాష్ట్రాలకు కూడా కరెంటును అమ్ముకోవచ్చని, దానికి తగ్గట్టుగా ట్రాన్స్‌మిషన్ లైన్లను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ, ఎస్సార్ రెన్యువబుల్స్ వంటి సంస్థలు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.

ఐటీ రంగం విషయానికి వస్తే, విశాఖపట్నం మరోసారి ఐటీ హబ్‌గా మెరవబోతోంది. ప్రముఖ సంస్థ ఇన్ఫోసిస్ యండాడలో రూ. 750 కోట్ల పెట్టుబడితో సుమారు 7,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. అలాగే అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' పేరుతో సరికొత్త టెక్నాలజీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. వీటితో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఏకంగా రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం విశేషం. పర్యాటక రంగంలో విజయనగరం, ఒంగోలు ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి పెరగనుంది.

ఫుడ్ ప్రాసెసింగ్  ఇతర భారీ పరిశ్రమల ద్వారా కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. తిరుపతిలో ఇండస్ కాఫీ, చిత్తూరులో రెడ్‌బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ వంటి సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే నెల్లూరు, విశాఖపట్నం, శ్రీసిటీ ప్రాంతాల్లో స్టీల్, ప్యాకేజింగ్  ఫార్మా రంగాలు విస్తరించనున్నాయి. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో ఏపీ పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కడమే కాకుండా, లక్షలాది కుటుంబాల్లో ఉద్యోగ కాంతిని నింపబోతోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టింది.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…