ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల అమలుపై పూర్తిగా దృష్టి సారించింది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలులో ఉండగా, తాజాగా తల్లికి వందనం వంటి ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలను ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
ఈ నెల 24న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా 28న బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో, హామీల అమలుకు కావాల్సిన నిధుల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2024లో ఏర్పడిన ఏపీ కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నెల 24న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 28న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా తల్లికి వందనం వంటి హామీల అమలుకు నిధుల కేటాయింపుపై దృష్టి సారించనున్నారు. జూన్‌లో తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమైంది. అయితే జూన్ మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ప్రతి తల్లికి రూ. 15,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇది వరకే వెల్లడించింది. సీఎం చంద్రబాబు సహా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత లెక్కల ప్రకారం 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తింపు పొందినట్లు ప్రభుత్వం నిర్థారించింది. అయితే ఈ పథకానికి మొత్తంగా రూ. 10,300 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అయితే ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్, అర్హుతలు వంటి వివరాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా సరే వారందరికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇవ్వనున్నట్లు సమాచారం.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!
గుంటూరులో జగన్ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..
రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!
గుంటూరులో జగన్ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..
అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!
మిగిలింది మరో 8 రోజులే.. దేశవ్యాప్తంగా రోడ్లన్నీ ప్రయాగ్‌రాజ్ వైపే..
డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: