ధరల స్థిరీకరణ నిధి ద్వారా దాదాపు రూ.550 కోట్లతో మామిడి, పొగాకు, కోకో రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రైతుల వద్ద మిగిలిపోయిన నల్లబర్లీ పొగాకును మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ఏయాలని సీఎం ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లకు దాదాపు రూ.350 కోట్లు ఖర్చయినా ఆ భారం భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మామిడి, పొగాకు, కోకో పంటలపై ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏడు మార్కెట్ యార్డుల్లో ఈ కొనుగోళ్లు ప్రభుత్వం ద్వారా శుక్రవారం నుంచి జరుగుతాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు. మామిడి రైతులు నష్ట పోకుండా కేజీకి రూ.12 చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..
కేజీపై రూ.8 ప్రాసెసింగ్ కంపెనీలు చెల్లిస్తే.. మిగిలిన రూ.4 ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందన్నారు. ఇలా రూ.150కోట్ల భారం భరిస్తూ ప్రభుత్వం దాదాపు ఐదున్నర లక్షల టన్నుల మామిడి కొనుగోళ్లు చేసి రైతుల్ని ఆదుకుంటుందని పేర్కొన్నారు. కోకో పంట కేజీ రూ.450కి కంపెనీలు కొనుగోలు చేస్తే ప్రభుత్వం మరో రూ.50 అదనంగా చెల్లిస్తుందన్నారు. ఇలా దాదాపు వెయ్యి మెట్రిక్ టన్నుల కోకోను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే లబ్ది నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుందన్నారు. మామిడి, నల్లబర్లీ, కోకో పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. రైతులెవ్వరూ నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!
జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!
వర్చువల్ సిస్టమ్ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: