భారతదేశంలోని విమాన ప్రయాణికుల సేఫ్టీ ఇంప్రూవ్ చేయడానికి, బోర్డింగ్‌ను స్మూత్‌గా చేయడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రెండింటికీ ఈ నియమాలు వర్తిస్తాయి. ప్రయాణికులు తీసుకెళ్లగల హ్యాండ్ లగేజీపై ఇప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. కొత్త బ్యాగేజీ రూల్స్ (Flight baggage rules) ఏంటి, ఏ మార్పులు వచ్చాయో తెలుసుకుందాం. ఇండియాలో విమాన ప్రయాణీకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ నిర్ధారించడానికి, చెక్-ఇన్, బోర్డింగ్ ప్రాసెస్‌ను స్ట్రీమ్‌లైన్ చేయడానికి BCAS క్యాబిన్ బ్యాగేజీకి క్లియర్ గైడ్‌లైన్స్ నిర్దేశించింది. వన్ హ్యాండ్ బ్యాగ్: ప్రతి ప్రయాణీకుడు విమానం లోపలికి ఒక క్యాబిన్ బ్యాగ్ (హ్యాండ్ బ్యాగ్) మాత్రమే తీసుకెళ్లవచ్చు. వెయిట్ లిమిట్: హ్యాండ్ బ్యాగ్ 7 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండకూడదు. సైజ్ లిమిట్: బ్యాగ్ మెజర్‌మెంట్స్ 55 సెం.మీ (ఎత్తు) x 40 సెం.మీ (పొడవు) x 20 సెం.మీ (వెడల్పు) మించకూడదు.
ఇది కూడా చదవండి: రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
పర్సనల్ బ్యాగులు: ల్యాప్‌టాప్ బ్యాగ్, మహిళల పర్స్ లేదా ఇతర చిన్న బ్యాగులు (3 కిలోల వరకు) వంటివి అనుమతిస్తారు. హ్యాండ్ బ్యాగుతో పాటు చిన్న పర్సనల్ బ్యాగులను తీసుకెళ్లే అవకాశం ఉంది. చెక్-ఇన్ బ్యాగేజీ: అన్ని ఇతర బ్యాగులను చెక్-ఇన్ చేయాలి. క్యాబిన్‌లోకి తీసుకెళ్లకూడదు. పెనాల్టీలు: ఈ రూల్స్‌ని ఉల్లంఘించడం వల్ల అదనపు ఛార్జీలు లేదా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇతర భద్రతా సంస్థలు ఇప్పుడు బ్యాగులను మరింత స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తున్నాయి. సెక్యూరిటీ చెకింగ్స్‌ని వేగవంతం చేయడం, విమానాశ్రయాలను మరింత ఆర్గనైజ్డ్‌గా మార్చే లక్ష్యంతో మార్పులు తీసుకొస్తున్నారు. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు కొత్త BCAS నియమాలకు అనుగుణంగా తమ బ్యాగేజీ పాలసీలను అప్‌డేట్ చేశాయి. ఎయిర్ ఇండియా ఎకానమీ, ప్రీమియం ఎకానమీలో 7 కిలోల వరకు ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లవచ్చు. బిజినెస్, ఫస్ట్ క్లాస్ అయితే 10 కిలోల వరకు ఉండే ఒక హ్యాండ్ బ్యాగ్ అనుమతిస్తారు. అదే ఇండిగోలో అయితే 7 కిలోల వరకు ఉండే క్యాబిన్ బ్యాగ్, 3 కిలోల వరకు ఒక పర్సనల్ బ్యాగ్ అలో చేస్తారు. రెండు బ్యాగుల మొత్తం పరిమాణం 115 సెం.మీ (పొడవు + వెడల్పు + ఎత్తు) మించకూడదు.
ఇది కూడా చదవండి: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ప్లీజ్ అందరూ క్షేమంగా ఉండండి! 50 మందికి పైగా..
అందుకే ఫ్లైట్ జర్నీ ప్లాన్ చేయడానికి ముందు మీ ఎయిర్‌లైన్ ప్రకటించిన గైడ్‌లైన్స్, లిమిట్స్ గురించి తప్పక తెలుసుకోవాలి. మీ హ్యాండ్ బ్యాగ్ 7 కిలోలు, 55 x 40 x 20 సెం.మీ లిమిట్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. లగేజీ 7 కిలోల కంటే ఎక్కువ ఉంటే, పెనాల్టీలు నివారించడానికి దాన్ని చెక్-ఇన్ బ్యాగేజీలో ఉంచండి. పాస్‌పోర్ట్, టిక్కెట్లు, మందులు, ఇతర ముఖ్యమైన వస్తువులను మాత్రమే హ్యాండ్ బ్యాగ్‌లో ప్యాక్ చేయండి. ఎక్కువ మంది విమానంలో ప్రయాణించడంతో, విమానాశ్రయాలు రద్దీగా మారుతున్నాయి. సేఫ్టీ, సెక్యూరిటీ ఛాలెంజెస్ పెరుగుతున్నాయి. క్యాబిన్‌లో తక్కువ బ్యాగులు ఉండటం వల్ల సెక్యూరిటీ చెక్స్ ఈజీ అవుతాయి. అలానే హ్యాండ్ లగేజీని పరిమితం చేయడంతో బోర్డింగ్, సెక్యూరిటీ చెక్స్‌లో లేట్ ఉండదు. ఆర్గనైజ్డ్ బ్యాగేజీ రూల్స్‌తో విమానాశ్రయాలు స్మూత్‌గా రన్ అవుతాయి.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!
జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!
వర్చువల్ సిస్టమ్ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: