మైలవరం మండలం ఎ. కంబాలదిన్నెలో గత నెల 23న మూడేళ్ల చిన్నారిని అత్యాచారం, హత్య చేసిన నిందితుడు దూదేకుల రహమతుల్లా (26) ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మైలవరం జలాశయంలో అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జలాశయం ఒడ్డున ఉన్న దుస్తులను గుర్తించి హత్యాచార ఘటన నిందితుడిగా పోలీసులు అనుమానించారు. అనంతరం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష చేయించాక దూదేకుల రహమతుల్లాగా నిర్దారించారు. జమ్మలమడుగు మండలం మోరగుడిలోని అతడి తల్లికి మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు వెళ్లగా ఆమెతోపాటు కుటుంబ సభ్యులు నిరాకరించారు.
తప్పని పరిస్థితుల్లో జమ్మలమడుగు పురపాలక సంఘం సిబ్బంది ద్వారా ట్రాక్టర్లో తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. చిన్నారి హత్యాచార ఘటన రోజునే నిందితుడు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి గాలించినా జాడ తెలియరాలేదన్నారు. గత నెల 24న ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావుతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అవమానానికి గురైన మోరగుడి గ్రామస్థులు నిందితుడి ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెలివేయడం, పోలీసుల గాలింపుతో మానసికంగా ఒత్తిడికి గురై నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు
చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైకాపా నేతల అత్యుత్సాహం.. పోలీసుల ఆగ్రహం వ్యక్తం! మంగళగిరిలో ఉద్రిక్తత..
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: